Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?
- July 6, 2026 / 05:35 PM ISTByFilmy Focus Desk
‘‘ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహపరచదు. చివరి 40 నిమిషాలు చూసి ప్రతి ఒక్కరూ కంగుతింటారు’’ – ‘లెనిన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత, ఆ సినిమాలో పార్ట్‌నర్ అయిన నాగవంశీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి. ఇవి వినడానికి, చదవడానికి నార్మల్‌గానే కనిపించొచ్చు. కానీ రీసెంట్ వచ్చిన ఓ సినిమా, ఆ సినిమాలో ఆ సీన్స్ చూపించిన ఇంపాక్ట్ గుర్తుకు చేసుకుంటే కచ్చితంగా ‘ఆ 40 నిమిషాలు’ ఏంటి? అనే చర్చ కచ్చితంగా జరుగుతుంది.
Naga Vamsi
ఆ సినిమా రామ్‌చరణ్ ‘పెద్ది’. ఈ సినిమా టాక్, వసూళ్ల విషయంలో ఎవరెన్ని మాట్లాడుకున్నా.. రామ్‌చరణ్ ఈ సినిమాకు ప్రాణం పెట్టిన విధానం గురించి, సినిమాలో చూపించిన నటన గురించి ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు/ అనరు కూడా. ముఖ్యంగా సినిమా ఆఖరి 40 నిమిషాల్లో రామ్‌చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనే కామెంట్లు చూశాం. ఈ సినిమాకు చరణ్‌కు జాతీయ అవార్డు రావొచ్చని, ఆ 40 నిమిషాలే దానికి కారణమవుతాయి అని కూడా అంటున్నారు.

ఇప్పుడు నాగవంశీ కూడా ‘లెనిన్’ సినిమా గురించి ఇలానే ఆలోచించి అన్నారో లేక నార్మల్ హైప్ ఇవ్వడానికి అన్నారో తెలియదు కానీ.. సినిమా ఆఖరి 40 నిమిషాలు కీలకం అని చెప్పకనే చెప్పారు. మామూలుగా అఖిల్ మంచి నటుడు, సరైన పాత్ర, చిత్రణ పడితే అదరగొడతాడు అని చెబుతుంటారు. గతంలో కొన్ని సినిమాల్లో గ్లింప్స్‌లా చూశాం కూడా. అయితే ఇప్పటివరకు అలాంటి చిత్రణ, నటన పూర్తి స్థాయిలో పడలేదు. ఇప్పుడు ‘లెనిన్’తో ఆ అవకాశం వస్తే అదరగొడతాడు అని చెప్పొచ్చు.
మరి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఎలాంటి కథ, కథనం, చిత్రణ రాసుకున్నారో చూడాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనిది నాగార్జున ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాటల్లో, టీమ్ మాటల్లో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. సినిమా మీద పాజిటివ్ వైబ్ కూడా వచ్చింది.
















