నాగవంశీ నెలకో సినిమా.. మళ్ళీ ఏమంటాడో..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టే నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒకటిగా నిలుస్తోంది. నిర్మాత నగవంశీ (Suryadevara Naga Vamsi)  ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఒక దాని తరువాత మరొక సినిమాను ప్రమోట్ వహిస్తున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇటీవలే ‘దేవర’ (Devara) చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో పంపిణీ చేసి మంచి లాభాలను అందుకుంది. ఈ విజయంతో మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఏకంగా నాలుగు కొత్త సినిమాలను వరుసగా రిలీజ్ చేయనుంది.

Naga Vamsi

మొదటగా, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించినా, అక్టోబర్ 31కి వాయిదా వేసుకున్నారు. తర్వాత ‘మ్యాడ్ స్కేర్’ (Mad) అనే సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మ్యాజిక్‌’ అనే మరో ప్రాజెక్టు గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణతో (Balakrishna)  తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చాలా ప్రెస్టీజియస్‌గా మారింది. ఈ సినిమాను 2025 జనవరిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నాగవంశీ భారీ ప్లాన్‌ చేస్తున్నారు. ఇలా వరుసగా నాలుగు నెలల్లో నాలుగు సినిమాలు తీసుకొస్తున్న నాగవంశీ (Naga Vamsi) పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఎదో ఒక కామెంట్ తో కాంట్రవర్సీలో నిలుస్తున్నారు.

రీసెంట్ గా దేవర టిక్కెట్ రేట్లు ఎక్కువగా పెంచారు అనే ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీతో వెళితే 1500 ఖర్చు అవుతుందని, ఈ రేటుతో సినిమా కంటే చీప్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందని కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ ప్రశ్నలకు భిన్నమైన స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇక రాబోయే రోజుల్లో నెలకు ఒక సినిమా వస్తోంది కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

జై హనుమాన్.. ఎంతమంది రిజెక్ట్ చేశారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus