Naga Babu, Sai Dharam Tej: తేజ్ ఆరోగ్యంపై మెగాబ్రదర్ కామెంట్స్!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ లో గాయపడడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మెగాఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేశాయి. తాజాగా ‘రిపబ్లిక్’ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు దేవకట్టా చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంతున్నాడని దేవకట్టా అన్నారు. పైగా ‘రిపబ్లిక్’ ఈవెంట్ ను లైవ్ లో చూశాడని కూడా అన్నారు. అయితే బయట పరిస్థితులు బాగాలేనందున ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న తేజు కోమాలో ఉన్నాడని పవన్ కళ్యాణ్ చెబితే.. ఇప్పుడు దేవకట్టా తేజు సినిమా ఈవెంట్ లైవ్ లో చూశారని అంటున్నారు. దీంతో ఏది నమ్మాలో ఫ్యాన్స్ కు అర్ధం కాలేదు. తాజాగా ఈ విషయంపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల అభిమానులతో చాట్ చేశారు నాగబాబు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘సాయి ధరమ్ తేజ్ గారు ఎలా ఉన్నారండి’ అని అడిగాడు. దానికి నాగబాబు ‘అతను త్వరగా కోలుకుంటున్నాడు. తొందర్లోనే మన ముందుకు వస్తాడు’ అని క్లారిటీగా చెప్పారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus