గతేడాది ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సినిమాల టికెట్ రేట్లకు సంబంధించి అమలులోకి తెచ్చిన జీవోల వల్ల పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఫెయిల్ అవుతున్నాయి. తెలంగాణలో తెలుగు సినిమాలు వేగంగా బ్రేక్ ఈవెన్ అవుతుంటే ఏపీలో ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కావడంలో పెద్ద సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే నాగబాబు తాజాగా హీరోల రెమ్యునరేషన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ల ఆపరేషన్స్ గురించి వైసీపీ మంత్రులకు తెలియదని నాగబాబు అన్నారు.
సినిమా బడ్జెట్ లో 10 నుంచి 12 శాతం హీరో పారితోషికం ఉంటుందని సినిమా రెమ్యునరేషన్ అనేది సినిమా ఖర్చులో భాగమని నాగబాబు చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది నిర్మాతకు నష్టం వస్తే పవన్ కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని నాగబాబు కామెంట్లు చేశారు. జానీ సినిమాకు డైరెక్టర్ గా, హీరోగా పవన్ తన పారితోషికం వదులుకున్నారని నాగబాబు పేర్కొన్నారు. చిరంజీవి అంజి సినిమాకు దాదాపుగా రెమ్యునరేషన్ ను వదులుకున్నారని నాగబాబు కామెంట్లు చేశారు.
ఆరెంజ్ సినిమాకు సంబంధించి తాను చరణ్ కు 70 శాతం పారితోషికం ఇవ్వలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీకి 30 శాతం రెమ్యునరేషన్ తీసుకోలేదని నాగబాబు కామెంట్లు చేశారు. రెమ్యునరేషన్ విషయంలో చాలామంది ఫ్లెక్సిబుల్ గా ఉంటారని నాగబాబు చెప్పుకొచ్చారు. సినిమా అనేది డిమాండ్ కు అనుగుణంగా జరిగే వ్యాపారమని వైసీపీ అమలు చేస్తున్న టికెట్ రేట్ల వల్ల నష్టం వస్తోందని నాగబాబు అన్నారు.
తెలుగు సినిమాలను ఏపీలో బ్యాన్ చేయాలని అలా చేసినా తమకు నష్టం లేదని నాగబాబు పేర్కొన్నారు. టెక్నాలజీ డెవలప్ అయిందని ఓటీటీ, డిజిటల్, యూట్యూబ్ ల ద్వారా తమకు డబ్బు వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!