Nagababu, RGV: కోట్లు పారితోషికం తీసుకునే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీతో అవసరం ఏంటి?: నాగబాబు

ఈ మధ్యనే టీడీపీ నాయకుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశం అయ్యింది. రాబోయే ఎన్నికల్లో పొత్తు ల గురించి కూడా త్వరలో క్లారిటీ రావచ్చు అనే కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉండగా.. పవన్ – చంద్రబాబు ల మీటింగ్ గురించి వైసీపీ నేతలు.. రకరకాల కామెంట్లు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా పవన్ తన ప్యాకేజీ కోసం చేస్తున్నదే అంటూ వాళ్ళు కామెంట్లు చేయడం అందరికీ తెలిసిన సంగతే.

రోజా కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటూనే ఉంది. ‘చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు సొంత జిల్లాలోనే గెలవలేకపోయారు. వాళ్లకు జనాదరణ లేదు. అక్కడి జనాలకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు గెలవడం ఇష్టం లేదు.. వాళ్ళు ఇండస్ట్రీ జనాలకే సాయం చేయరు’ అంటూ కామెంట్లు చేసింది. అలాగే రాంగోపాల్ వర్మ కూడా కాపులను వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ కామెంట్లు చేశాడు.

తాజాగా వీటి పై నాగబాబు స్పందించారు.ఆయన మాట్లాడుతూ.. “వైసీపీ నాయకుల తాత, ముత్తాతలు… ఏమైనా ప్యాకేజీలు ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్.. సినిమా చేస్తే కోట్ల రూపాయల పారితోషికం వస్తుంది. అప్పుడు తనకు ప్యాకేజీతో పనేంటి? మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. మా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మా దగ్గర ఉన్న డబ్బుతో అందరికీ సాయం చేస్తున్నాం. జనాలకు ఉపయోగపడుతున్నాం.

మీరు మీ దగ్గర ఉన్న లక్షల కోట్ల డబ్బుని తీసి అందరికీ సాయం చేసి మొదలుపెట్టండి’ అంటూ మండిపడ్డారు నాగబాబు. అటు తర్వాత రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ… ‘ఆడో పెద్ద ఎదవ, సన్నాసి. అవసరం వస్తే ఎంత నీచానికైనా దిగజారతాడు. కాపులను వెన్నుపోటు పొడవటం, తాకట్టు పెట్టడమేంటి’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus