అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన నాగార్జున

అక్కినేని నాగచైతన్య చిన్న తనయుడు అఖిల్ సినిమాల్లోకి రాకముందే అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అఖిల్ అంటే క్రేజ్ ఉంది. అందుకే అతనికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ అవకాశాన్ని స్వయంగా నాగార్జునే తిరస్కరించారు. ఈ విషయాన్ని నాగ్ ఈరోజు బయటపెట్టారు. “అక్కినేని అఖిల్ ని బాలీవుడ్ లో పరిచయం చేసేందుకు కరణ్ జోహార్ చాలా సార్లు ట్రై చేశారు. కానీ అందుకు బ్రేక్ వేసింది నేనే. కరణ్ జోహార్ కి అఖిల్ అంటే ఎంతో ఇష్టం. అందుకే బాలీవుడ్ లో పరిచయం చేస్తానని ఇప్పటికే నాలుగు సార్లు అడిగినా నేనే వద్దన్నాను. అఖిల్ నటుడిగా ఇంకా కిడ్. చాలా నేర్చుకోవాల్సి ఉంది. అదే విషయం కరణ్ కి చెప్పాను”అని వెల్లడించారు. అంతేకాదు కొడుకుపై సెటైర్ కూడా వేశారు.

“అఖిల్ ఆల్రెడీ తెలుగులో తిన్నాడు.. అందుకే పెద్దోళ్ల మాట వింటున్నాడు. అది కూడా కరణ్ కి చెప్పాను”అని నాగ్ నవ్వుతూ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. “కరణ్ తో అఖిల్ ఎంతో స్నేహంగా ఉంటాడు. ఆ ఇద్దరూ కలిసి బాలీవుడ్ సినిమా చేసేందుకు టైమ్ పడుతుంది. అయితే అందుకు ఇంకా ఎంత టైమ్ పడుతుందో మాత్రం చెప్పలేను. ముందు అఖిల్ కెరీర్ టాలీవుడ్ లో టేకాఫ్ అవ్వాలి. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం “మిస్టర్ మజ్ను” టీజర్ కిక్కిచ్చింది. వెంకీ అట్లూరి అద్భుతమైన విజువల్స్ ని క్రియేట్ చేశాడు” అంటూ నాగార్జున అభినందనలు కురిపించారు. అఖిల్ మూడో మూవీ కంటే ముందు నాగ్ నటించిన దేవదాస్ ఈ వారం థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus