బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఆసక్తికరంగా జరిగింది. గౌతమ్ ఎలిమినేషన్ అయ్యాడని ముందుగానే తెలిసినా కూడా హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా చాలా ఉత్కంఠంగా చూశారు. శోభా శెట్టి – గౌతమ్ – పల్లవి ప్రశాంత్ ముగ్గురూ నామినేషన్స్ లో ఉన్నప్పుడు నాగార్జున పల్లవి ప్రశాంత్ ని ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడమని చెప్పారు. కానీ, తనకోసం తను వాడుకోనని, ఆడియన్స్ వెళ్లిపోమంటే వెళ్లిపోతానని అన్నాడు. అంతేకాదు వేరేవాళ్లకోసం వాడితే ఒకరి దృష్టిలో హీరో అయి, ఇంకొకరి దృష్టిలో విలన్ అవ్వడం ఇష్టంలేదని చెప్పాడు.
బిగ్ బాస్ అంటే ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చానని, ఆడియన్స్ కూడా బాగా ఓట్లు వేసి సేఫ్ చేస్తున్నారని అలాంటపుడు ఈ పాస్ వాడి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పాడు. దీంతో నాగార్జున ఈ పాస్ ఎవరికీ వాడకపోతే వేస్ట్ అయిపోతుందని ఈవారమే వాడాలని చెప్పాడు. ఆ తర్వాత రౌండ్ లో పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా శోభాశెట్టి ఇంకా గౌతమ్ ఇద్దరు మాత్రమే నామినేషన్ లో ఉన్నప్పుడు మరోసారి పల్లవి ప్రశాంత్ ని పాస్ వాడమని అడిగాడు. దీనికి ఒప్పుకోలేదు పల్లవి ప్రశాంత్.
అంతేకాదు, శోభాశెట్టి ఇంకా గౌతమ్ ఇద్దరినీ కూడా పల్లవి ప్రశాంత్ ని కన్విన్స్ చేసుకోమని అడిగాడు హోస్ట్ నాగార్జున. ఇద్దరూ కూడా మాకు పల్లవి ప్రశాంత్ ని అడగడం ఇష్టం లేదని, తను కష్టపడి గెలుచుకున్నాడు కాబట్టి అది అతనిష్టం అంటూ గౌతమ్ చెప్పాడు. ఇదే మాట శోభాశెట్టి కూడా అన్నది. నాకు అడగడం ఇష్టం లేదని క్లియర్ గా చెప్పింది. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ స్టోర్ రూమ్ కి వెళ్లిపోయింది. శోభాశెట్టి – గౌతమ్ ఇద్దరూ యాక్టివిటీ రూమ్ లోకి వచ్చాక, గౌతమ్ ఎలిమినేట్ అనగానే అందరూ ఖంగుతిన్నారు. నిజానికి శోభాశెట్టి వెళ్లిపోతుందని అనుకున్నారు.
కానీ, శోభాశెట్టి సేఫ్ అయిన తర్వాత రియలైజ్ అయ్యింది. మన గేమ్ మనం ఆడుకుందామని చాలా క్లియర్ గా చెప్పింది. గౌతమ్ ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు మాస్క్ తో ఆడుతున్నారు ? ఎవరు మాస్క్ లేకుండా ఆడుతున్నారు అనేది చెప్పాలని చెప్పాడు కింగ్ నాగార్జున. అందరి గురించి చెప్పిన గౌతమ్ మరోసారి శివాజీతో ఆర్గ్యూ పెట్టుకుంటూనే హౌస్ నుంచీ వెళ్లిపోయాడు. ఇక ఫైనల్ గా హోస్ట్ నాగార్జున ఈవారం హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఓటింగ్ ఆర్డర్ వేరు, ఇంట్లో సేఫ్ అయ్యే ఆర్డర్ వేరు అని క్లారిటీగా చెప్పాడు.
కానీ, బోటమ్ 2లో ఉండేవాళ్లు మాత్రం పక్కాగా ఉంటారనేది అన్నాడు. అంతేకాదు, ఈవారం బోటమ్ లో అర్జున్ ఉన్నాడని, కానీ ఫినాలే టిక్కెట్ గెలవడం వల్ల సేఫ్ అయ్యాడని చెప్పేసరికి హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఉలిక్కి పడ్డారు. అర్జున్ లీస్ట్ లో ఉంటే మరి అర్జున్ కదా ఎలిమినేట్ అవ్వాలి. బిగ్ బాస్ రూల్ ప్రకారం ఫినాలే టిక్కెట్ గెలిస్తే ఇమ్యూనిటీ రాదు కదా అంటూ లెక్కలు వేశారు. ఎలిమినేషన్ లో నాగార్జు ఈ మాట చెప్పకుండా ఉండాల్సిందని, అనవసరంగా ఇలా చెప్పడం వల్ల అర్జున్ కాన్ఫిెడెన్స్ దెబ్బతింటుందనే అభిప్రాయ పడ్డారు.
అసలే పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని వాడించలేకపోయారు ? అలాగే ఇప్పుడు అర్జున్ బోటమ్ లో ఉంటే మరి గౌతమ్ కి ఎందుకు అన్యాయం చేశారు ? ఇలాంటి ప్రశ్నలన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ మదిలో మెదులుతున్నాయి. అంతేకాదు, ఈవిషయంలో గౌతమ్ కి అన్యాయం జరిగిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సండే ఎపిసోడ్ లో నా సామిరంగా హీరోయిన్, హైనాన్న ప్రమోషన్స్ కోసం నాని వచ్చి హౌస్ మేట్స్ ని (Bigg Boss 7 Telugu) పలకరించి సందడి చేశారు. అదీ మేటర్.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!