అక్కినేని నాగార్జున హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ శివ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆ అభిమానంతో ఆ తర్వాత నాగ్ వర్మ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశారు. అవి అంతగా ఆడలేదు. అయినా అభిమానం తగ్గలేదు. ప్రస్తుతం వర్మ కెరీర్ అసలు ఏమి బాగాలేదు. స్టార్ హీరోలు ఎవరూ అతని దర్శకత్వంలో నటించడానికి ముందుకురావడం లేదు. అతనికి మంచి హిట్ ఇవ్వాలని ఉద్దేశంతో నాగార్జున రిస్క్ అని తెలిసినా ఆఫీసర్ సినిమా చేశారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసినా ఫస్ట్ డే షేర్ కోటి కూడా దాటలేదు.
దీంతో నాగ్ అభిమానులు వర్మపై బూతులుతిట్టారు. నాగ్ పైన కూడా విమర్శలు చేశారు. అలాగే ఈ చిత్రాన్ని కొన్న వారు కూడా ఆత్మహత్యవరకు వెళ్లారు. ఈ కామెంట్స్, వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నాగ్ సినిమా ఫలితంపై పరోక్షంగా స్పందించారు. కొటేషన్ రూపంలో సందేశం ఇచ్చారు. “గుడ్ మార్నింగ్. ఒక వారం ముగిసిపోయింది. మరో సోమవారం వచ్చింది. ఈ సమయంలో విన్ స్టన్ చర్చిల్ చెప్పిన మాట గుర్తుకొస్తోంది. “విజయం అంతిమం కాదు.. అపజయం ప్రాణాంతకం కాదు. దైర్యంగా ముందుకు వెళ్ళాలి”.. అంటూ నాగ్ ట్వీట్ చేశారు. అంటే ఆఫీసర్ సినిమా ఫలితాన్ని మరిచిపోయి నెస్ట్ సినిమా గురించి ఆలోచించమని పరోక్షంగా అభిమానులకు సూచించారు.