Nagarjuna,Amala.Akhil: అమల నటనకు ఎమోషనల్ అయిన హీరో అఖిల్!

నూతన డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో ప్రియదర్శి వెన్నెల కిషోర్ అమల వంటి నటీనటులు కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానుంది. టైం ట్రావెల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మదర్ సెంటిమెంటుతో ఈనెల తొమ్మిదవ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచారు.ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు సినీ సెలబ్రిటీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఇక ఈ ప్రీమియర్ చూడటం కోసం డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి దర్శకులతో పాటు నాగార్జున, అఖిల్, అమల వంటి తదితరులు కూడా ఈ సినిమా చూశారు.

ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఇందులో అమల నటన చూసి కంటతడి పెట్టుకున్నారు. అమల నటన ఎంతో అద్భుతంగా ఉందని ఈమె నటించిన అమ్మ పాత్ర ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా నాగార్జున చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ అమల నటనపై ప్రశంశలు కురిపించారు. ఇక అఖిల్ సైతం మదర్ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించారని ఎమోషనల్ అయ్యారు.

ఇలా అమ్మ సెంటిమెంటుతో వచ్చిన సినిమాలు ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఇక అమల నటిగా ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా కాలం తర్వాత ఈమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో తల్లి పాత్రలలో కం బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా అనంతరం ఈమె ఒకే ఒక జీవితం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus