Nagarjuna, Akhil: మరోసారి కొడుకుతో సందడి చేయడానికి సిద్ధమైన నాగార్జున?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన ది ఘోస్ట్ ఫ్రీ రిలీజ్ వేడుకను కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున తన ఇద్దరు కొడుకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఇలా వేదికపై అక్కినేని హీరోలు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే నాగార్జున ఇప్పటికే తన కొడుకులతో కలిసి పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే.

మనం సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసిన నటించారు. అలాగే నాగచైతన్యతో కలిసి నాగార్జున బంగార్రాజు సినిమాలో నటించి సందడి చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తన చిన్న కుమారుడు అఖిల్ తో కలిసి సందడి చేయడానికి నాగార్జున సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగర్జున ఇదే విషయాన్ని ఘోస్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా తెలియజేశారు. ఈ ఏడాది నాగచైతన్యతో కలిసి తాను బంగార్రాజు సినిమా ద్వారా మీ ముందుకు వచ్చాను

త్వరలోనే అఖిల్ తో కలిసి భారీ మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ది ఘోస్ట్, ఏజెంట్ కలిపితే ఎలా ఉంటుందో అలా మా ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఉంటుందని నాగార్జున వెల్లడించారు.ఇక ఘోస్ట్ సినిమా గురించి మాట్లాడుతూ 30 సంవత్సరాలు క్రితం తాను అక్టోబర్ 5వ తేదీ చైన్ పట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

ఇప్పుడు అదే అక్టోబర్ 5వ తేదీన కత్తి పట్టుకొని మీ ముందుకు వస్తున్నాను.అప్పుడు ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించమని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా నాగార్జున వేదికపై మాట్లాడారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించిన విషయం తెలిసిందే.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus