నాగార్జున, నాని కలయికలో మల్టీ స్టారర్ మూవీ ?
- July 19, 2017 / 12:44 PM ISTByFilmy Focus
అక్కినేని నాగార్జున మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. ముఖ్యంగా యువ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. కార్తీతో కలిసి నాగ్ చేసిన ఊపిరి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం యువ నటీనటులతో కలిసి రాజు గారి గది 2 చేస్తున్నారు. మరో మల్టీ స్టారర్ మూవీకి నాగార్జున ఒకే చెప్పినట్లు సమాచారం. కార్తికేయ, ప్రేమమ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన చందు మొండేటి చెప్పిన కథ బాగుండడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే ఇందులో మరో హీరో కూడా ఉండనున్నారు.
అతనే నాని. వరుసగా ఏడు హిట్స్ సాధించి రికార్డ్ నెలకొల్పిన నేచురల్ స్టార్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం నాని ఎం సి ఏ చేస్తున్నారు. తర్వాత కృష్ణార్జున యుద్ధం చేయనున్నారు. ఈ రెండూ సినిమాలు చేస్తూనే నాగ్ కాంబినేషన్ మూవీని కూడా పట్టాలెక్కించనున్నట్లు టాక్. ఈ మల్టీ స్టారర్ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















