తెలుగు సినిమాకు ఓటీటీ భారమా? చాలా రోజుల నుండి ఈ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు సాధారణ సినిమా మీద సాంకేతికత ప్రభావం ఎక్కువవుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది. దీని గురించి ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’ విడుదలైన సందర్భంగా.. మీడయాతో మాట్లాడతూ సినిమాల గురించి, పరస్థితుల గురించి మాట్లాడారు. దీంతో ఆయన మాటలు వైరల్‌గా మారాయి.
ఒకప్పుడు మనం తమిళ, మలయాళ సినిమాలు తప్పితే మిగతా భాషల్లో సినిమాల్ని అంతగా చూసేవాళ్లం కాదు. ఇప్పుడు ఏకంగా జర్మన్, కొరియన్, ఫ్రెంచ్ అంటూ రకరకాల సినిమాలు చూసేస్తున్నాం. ఇదంతా ఓటీటీల చలవే అని వివరించారు నాగార్జున. ఓటీటీల రాకతో సినిమా పని అయిపోయిందని కొంతమంది అంటున్నారు. కానీ ఈ మాటల్ని నేను సమర్థించను. నా దృష్టిలో సినిమా మరింతగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా దర్శకులు, నటులు అప్‌డేట్ అవ్వాలి. లేదంటే ఇబ్బంది అని చెప్పారు నాగార్జున.
అలాగే సినిమాలు అంటే రిస్క్ ఎప్పుడూ ఉంటుందన్న నాగార్జున కథల పరంగా పాత రోజుల్లో ఎలాంటి శ్రద్ధ తీసుకునేవాళ్లో ఆ పద్ధతులు ఇప్పుడూ కనిపిస్తున్నాయి అని చెప్పారు. నిర్మాతలు అంటే కేవలం డబ్బులు పెట్టేయడం కాకుండా.. కంటెంట్ కూడా చూసుకుంటున్నారు. దర్శకులతో కలిసి పని చేసి మంచి సినిమా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణే.. ‘సీతారామం’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు. కంటెంట్ విషయంలో నిర్మాతలు బలంగా ఉండబట్టే ఆ సినిమాలు వచ్చాయి అని వివరించారు నాగార్జున.
ఇక విజువల్ ఎఫెక్ట్స్ వినియోగం గురించి మాట్లాడుతూ.. కథల్ని రియలిస్టిక్‌గా తీయడానికి విజువల్ ఎఫెక్ట్స్ దోహదం చేస్తాయి. లేకపోతే మన దగ్గర నుండి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలు వచ్చేవే కావు. కొన్ని కథల్ని మరింత సహజంగా తీయాలంటే విజువల్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే. అంతెందుకు హాలీవుడ్‌లో కూడా ఒకప్పటిలా రెగ్యులర్ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. మొత్తం సినిమా మారుతోంది. దాంతోపాటు మనమూ మారాలి అని చెప్పారు నాగార్జున.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!