Nagarjuna: రివ్యూలపై నాగార్జున కామెంట్స్‌ వైరల్‌

  • September 15, 2022 / 01:52 PM IST

సినిమా వాళ్లు – రివ్యూలు.. ఈ రెండింటికీ అంత మంచి అనుబంధం అయితే ఉండదు. అంటే సినిమాకు రివ్యూకు మంచి బంధం ఉన్నా.. సినిమా వాళ్లు, రివ్యూలకు కాదు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు రివ్యూలు ఎలా ఉంటాయో అని, ఓవైపు ప్రేక్షకులు చూస్తుంటే.. రివ్యూలు తమ సినిమాను ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అనే భయంతో సినిమా వాళ్లు ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది తారలు రివ్యూలు, రివ్యూయర్ల మీద నేరుగా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాగార్జున దీనికి భిన్నంగా స్పందించారు.

రివ్యూలు, రివ్యూల వెబ్‌సైట్ల గురించి నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీంతో ఆయన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. సినిమా రివ్యూలపై, రివ్యూ వెబ్‌సైట్లపై నాగ్‌ చెప్పిన మాటలు రివ్యూయర్లకు మంచి బూస్టింగ్‌ ఇస్తాయని అంటున్నారు. నేను ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలంటే కచ్చితంగా ఐఎండీబీలో రేటింగ్ చూస్తాను. అందులో అంతా ఓకే అనుకున్నాకే ఆ సిరీస్‌ / సినిమా చూస్తాను అని చెప్పారు. అయితే ఏదైనా రివ్యూ చెక్‌ చేసినప్పుడు దానికి కనీసం 1000 రివ్యూలు వచ్చాయా లేదా అని చూసుకుంటాను అని నాగార్జున చెప్పారు.

కనీసం 7 రేటింగ్ ఉంటేనే ఆ సినిమా లేదా వెబ్ సిరీస్ చూస్తాను అని నాగార్జున వెల్లడించారు. ఆ మాత్రం రేటింగ్ లేకపోతే ఆ సినిమా లేదా వెబ్ సిరీస్ చూసి టైం వేస్ట్ కదా అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. సినిమా విడుదలైన వెంటనే రివ్యూ ఇచ్చి ప్రేక్షకులు సినిమాలకు థియేటర్లకు రాకుండా చేస్తున్నారంటూ కొంతమంది సినిమా జనాలు ఆవేదన వ్యక్తం చేసిన సమయంలో… నాగార్జున ఇలా రివ్యూలపై ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం ఆసక్తికరమైన విషయమే. మరి దీనిపై మిగిలిన హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

అయతే సినిమా రివ్యూను రివ్యూగా ఇచ్చేటట్లయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఏదో ఒక కారణంతో రివ్యూలో లేని పోనివి రాసే వెబ్‌సైట్లను ఎవరూ సపోర్టు చేయరు. ఆఖరికి నాగార్జున కూడా అలా అనరు అనే విషయం గుర్తు చేసుకోవాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus