Dhanush, Nagarjuna: అలా పిలవడం గర్వ కారణమంటున్న నాగ్!

దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న అతికొద్ది మంది టాలీవుడ్ హీరోలలో నాగార్జున ఒకరు. నాగార్జున నటించిన పలు సినిమాలు హిందీలో విడుదలై సక్సెస్ సాధించాయి. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగ్ నటించిన బంగార్రాజు నాలుగు 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. మరో 9 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

అయితే ఏపీలో కరోనా ఆంక్షలు అమలు కావడం, ఊహించని స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగార్రాజు సినిమాపై ఆ ఎఫెక్ట్ పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నైజాంలో ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. అఖండ, పుష్ప సినిమాల తరహాలో నైజాంలో బంగార్రాజు సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుండటం గమనార్హం. 2022 సంవత్సరంలో బంగార్రాజు సినిమా తొలి హిట్ గా నిలిచింది.

తాజాగా నాగార్జునకు బాలీవుడ్ మీడియా ప్రతినిధుల నుంచి మిమ్మల్ని ఇప్పటికీ సౌత్ యాక్టర్ అని పిలుస్తుంటారా అనే ప్రశ్న ఎదురు కాగా నాగ్ ఆల్ ద టైం అంటూ స్మార్ట్ గా జవాబిచ్చారు. సౌత్ యాక్టర్ అని పిలిపించుకోవడం గర్వ కారణమని నాగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీ, ముంబైకు వెళ్లిన సమయంలో రెస్టారెంట్ కు వెళితే తనను సౌత్ యాక్టర్ అని అంటారని అలా పిలవడం తనకు ఏ మాత్రం అభ్యంతరకర కాదని నాగ్ చెప్పుకొచ్చారు.

కొన్ని రోజుల క్రితం ధనుష్ ఆత్రంగీ రే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా బాలీవుడ్ మీడియా ప్రతినిధులు సౌత్ యాక్టర్ అని పిలవడంపై ధనుష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టర్ ఎక్కడైనా యాక్టరే అని ధనుష్ చెప్పుకొచ్చారు. సౌత్ యాక్టర్ అనే పిలుపు విషయంలో ధనుష్ ఒక విధంగా స్పందిస్తే నాగార్జున మరో విధంగా స్పందించడం గమనార్హం. విడాకుల ప్రకటన ద్వారా ధనుష్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus