ఇంటర్వ్యూ : ‘ది ఘోస్ట్’ గురించి అక్కినేని నాగార్జున చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • October 6, 2022 / 07:41 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా కనిపించబోతున్నారు. సోనాల్ చౌహాన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

‘తమహగనే’ వెపన్ గురించి ప్రమోషన్స్ ఎక్కువగా వాడారు. దీని వెనుక ఏమైనా కథ ఉందా ?

అవును… తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉంది. సినిమాలో అయితే అది ఉండదు. దర్శకుడు ప్రవీణ్ నాకు దాని గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పాడు. అది నచ్చడంతో దాని గురించి గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా హిట్ అయితే దాని బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం (నవ్వుతూ)

‘ది ఘోస్ట్’ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారు?

ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ డ్రామా ఉంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బాగుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీ ని కాపాడటానికి హీరో చేసే పోరాటం అందరికీ నచ్చుతుంది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ రేంజ్లో పండుతుంది అని నేను అనుకోలేదు.ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలవుతారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.

ఈ మూవీని ‘శివ’ తో పోల్చడానికి కారణం ?

ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ నాకు ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ‘శివ’ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ ఉందనిపించింది.

ఈ సినిమా విషయంలో ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా?

నేను చాలా యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయలేదు.అలాంటి సినిమా చేయాలని ఉండేది. ‘గరుడ వేగ’ ని ప్రవీణ్ సత్తారు తీసిన విధానం నాకు బాగా నచ్చింది.దీంతో ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ‘ది ఘోస్ట్’ కథని తయారు చేశాడు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాను.అంతే అంతకు మించి ఛాలెంజింగ్ అనిపించింది ఏమీ లేదు.

ట్రైలర్ లో అన్ని రొమాన్స్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ కనిపించాయి ? ఇన్ని ఎలిమెంట్స్ తో సినిమా చేసినప్పుడు ఎలా అనిపించింది ?

‘ది ఘోస్ట్’ లో ఉన్న బ్యూటీ అదే. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి.హీరోయిన్ పాత్ర కూడా చాలా పరిణితితో ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా ఉంటుంది.

మీరు చిరంజీవి గారి సినిమా ఒకే రోజు వస్తుంది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సినిమాలు వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది ?

మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు ఒకేరోజు విడుదలై మంచి విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు.

‘శివ’ సెంటిమెంట్ వల్లే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ రిలీజ్ ను ఫిక్స్ చేశారా?

‘శివ’ సినిమా అక్టోబర్ 5న వచ్చింది నిజమే.అయితే ‘నిన్నే పెళ్ళాడతా’ అక్టోబర్ 4న వచ్చింది. ఒక అభిమాని ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ది ఘోస్ట్ అక్టోబర్ 4 నే యూఎస్ లో రిలీజ్ అవుతుంది. ఆ రకంగా ‘శివ’ తో పాటు నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ).

‘శివ’ ని రీ రిలీజ్ చేసే అవకాశం ఉందా?

తప్పకుండా.! శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అది మాత్రమే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి.

మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చెరిగిపోయాయి అని అనుకోవచ్చా ?

ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ కు వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్ర లో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ?

ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా ఉంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66 రోజుల్లోనే సినిమా పూర్తయింది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..!

రెండు స్క్రిప్ట్ లు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి.ఇవి కూడా యాక్షన్ జోనర్ లోనే ఉంటాయి. అలాగే వెబ్ సిరీస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus