బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం అనూహ్యంగా గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. అంతకముందే ఎలిమినేట్ అయిపోయినా సరే, సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి తన సత్తాని చాటాడు. అంతేకాదు, అప్పట్నుంచీ శివాజీనే టార్గెట్ చేస్తూ ప్రతిసారి నామినేషన్స్ లో ఒకటే పాట పాడేవాడు. పల్లవి ప్రశాంత్ – యావర్ ఇద్దరికీ ఇచ్చిన సపోర్ట్ ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వడం లేదని, వాళ్ల తరపున అంటే వెంటనే రియాక్ట్ అవుతారని, మిగతావాళ్లకి అస్సలు సపోర్ట్ చేయరని నిరూపించాలని అనుకున్నాడు. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు కూడా వాళ్లు చేసే తప్పులు తెలియవని మండిపడ్డాడు.
గౌతమ్ పాయింట్ లో అర్దం ఉన్నా కూడా చెప్పడంలో మాత్రం విఫలం అయ్యాడు. తనకి నెగిటివ్ అయిన యావర్ ఎగ్జాంపుల్ తెచ్చేసరికి నాగార్జున కూడా గౌతమ్ కి గడ్డిపెట్టారు. శివాజీ ఇంకా గౌతమ్ ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ జరిగింది. ప్రతిసారి కుళ్లు – కుట్ర, కుతంత్రంతోనే నామినేషన్స్ లో అదే విషయాన్ని తీస్కుని వస్తాడని శివాజీ గట్టిగా మాట్లాడాడు. అంతేకాదు, ఈపుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉందని కుళ్లు – కుట్ర లేకుండా చూసుకోవడం ఎలా అనే పుస్తకాన్ని గౌతమ్ కి ఇచ్చాడు.
అయితే, గౌతమ్ ఫస్ట్ నుంచీ కూడా శివాజీ గ్రూప్ చేసే తప్పులని నిరూపించాలనే ప్రయత్నం చేశాడు. అది బెడిసి కొట్టింది. సీరియల్ బ్యాచ్ లో పూర్తిగా కలవకపోయినా వాళ్లకి సపోర్టింగ్ గానే ఉన్నాడు. అందుకే, నాగార్జున ఇదే పద్దతిలో ప్రియాంక కూడా శోభాని, ఇంకా అమర్ దీప్ ని ఎప్పుడూ నామినేట్ చేయలేదు కదా, వాళ్లు ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా కూడా ప్రియాంకకి కనిపించలేదా అప్పుడు ప్రియాంకని ఎందుకు నువ్వు నిలదీయలేదని గౌతమ్ ని ఇరకాటంలో పెట్టారు. దీంతో గౌతమ్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.
మరోవైపు గౌతమ్ తో పాటుగా ప్రియాంకకి సైతం క్లాస్ పీకారు కింగ్ నాగార్జున. ఇండివెడ్యువల్ గేమ్ ఎక్కడా ఆడావో చెప్పు అంటూ మాట్లాడారు. అమర్ ఎమోషనల్ గా బ్లాక్ మైయిల్ చేస్తున్నాడని నీ పాయింట్స్ ని గౌతమ్ నుంచీ తనకి ఇప్పించావ్. ఇది గ్రూప్ గేమ్ కాదా అని నిలదీశారు. అంతేకాదు, శోభాశెట్టి గేమ్ లో డెడ్ అవ్వకుండా మంచిగా హెల్ప్ చేశావ్ అంటూ కౌంటర్స్ వేశారు. అంతేకాదు, గేమ్ లో ముగ్గురూ అనుకున్నాకే పాయింట్స్ ని షఫిల్ చేశారా ? లేదా గౌతమ్ కి గ్రాటిట్యూడ్ అని ఇచ్చావా అంటూ అడిగారు.
ఇది గ్రాటిట్యూడ్ అని ప్రియాంక క్లియర్ గా చెప్పింది. మరి తర్వాత గౌతమ్ ని వెళ్లి ఎందుకు అడిగావ్ అంటూ ప్రియాంక చేసిన తప్పుని ఎండగట్టారు. వీళ్లిద్దరితో పాటుగా యావర్ కి కూడా గేమ్ సరిగ్గా ఆడలేకపోయావ్ అన్నది క్లియర్ గా ఎక్స్ ప్లనేషన్ చేశారు. అమర్ చేసిన పౌల్స్ ని కూడా చూపించారు. మొత్తానికి గౌతమ్ ఇంకా శివాజీ విషయంలో మాత్రం గౌతమ్ కి ఇంకా క్లారిటీ రాలేదు. ఆదివారం ఎలిమినేట్ (Bigg Boss 7 Telugu) అయ్యేటపుడు ఏం మాట్లాడతాడు అనేది ఆసక్తికరం.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!