అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున ఏం మాట్లాడినా.. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి సక్సెస్ అయ్యాడు. అందులోనూ కొత్త దర్శకులతో కొత్త కథలను చేసి మరీ సక్సెస్ అవ్వడం కచ్చితంగా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇటీవల ‘వైల్డ్ డాగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం నమోదు కాలేదు.
దాంతో ఈ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇదిలా ఉండగా.. ఇటీవల నాగార్జున.. రానా హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోకి గెస్ట్ గా విచ్చేశాడు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ జనరేషన్ డైరెక్టర్ల గురించి కొన్ని సీరియస్ కామెంట్లు చేసాడు. ‘మీ జనరేషన్ నుండీ ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా..? 90ల నుండీ మీరు వెనక్కి తీసుకు రావాలని ఆశపడుతున్న ఒక క్వాలిటీ చెప్పండి’ అంటూ నాగార్జునను ప్రశ్నించాడు హోస్ట్ రానా. దీనికి ఆయన జవాబిస్తూ..
‘ఫినిష్ ద మూవీ గాట్ డ్యామ్ ఇన్ 50 డేస్ మ్యాన్’ అంటూ చెప్పుకొచ్చాడు. దానిని ఆయన మరింతగా విశ్లేషిస్తూ.. ‘ప్రెజెంట్ జెనెరేషన్లో ఒక్క సినిమాకి ఎందుకు సంవత్సరాలు తరబడి టైం తీసుకుంటున్నారు అనే విషయం అర్థం కావడం లేదు. అప్పట్లో ఎలాంటి సినిమా అయినా 50 రోజుల్లో పూర్తయిపోయేది.కానీ ఇప్పుడు అలా కాదు. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసేలా ఉండాలి. అది ఎంత లాభం అనేది నిర్మాతను కాబట్టి నాకు తెలుసు. 90ల నుండీ నేను వెనక్కి తీసుకురావాలి అనుకునే క్వాలిటీ ఇదే’ అంటూ సీరియస్ గా చెప్పుకొచ్చాడు నాగార్జున.