Nagarjuna: ‘రావణాసుర’ బాటలోనే నాగార్జున సినిమా!

‘ఘోస్ట్’ ప్లాప్ రిజల్ట్ తో నాగార్జున వేగంగా సినిమాలు చేయడం తగ్గించారు. కొంచెం గ్యాప్ తీసుకుని వరుసగా కథలు వింటూ వచ్చారు. స్టార్ డైరెక్టర్లు తెచ్చిన కథలు కూడా నాగార్జునకి నచ్చలేదు. కానీ ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ప్రసన్నకుమార్ బెజవాడ మొదటిసారి డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఓ రీమేక్ సినిమా కథ అని తెలుస్తుంది. కానీ చిత్ర బృందం కానీ, ప్రసన్న కుమార్ కానీ.. దానికి ఒప్పుకోవడం లేదు.

ఇది నా సొంత కథ అని చెబుతున్నట్టు వినికిడి. మలయాళంలో హిట్టైన `పొరింజు మ‌రియ‌మ్ జోస్‌` చిత్రాన్ని నాగార్జునతో రీమేక్ చేయబోతున్నారు. రెండు రోజుల క్రితమే రీమేక్ రైట్స్ ను కూడా కొనుగోలు చేశారు. కానీ ఇది రీమేక్ సినిమా అని అనౌన్స్ చేయడానికి చిత్ర బృందం రెడీగా లేదు. ఒకవేళ టైటిల్ చెబితే.. ఓటీటీలో ఆ సినిమాని చేసేస్తారు అనే టెన్షన్ కాబోలు. ఒకప్పటిలా రీమేక్ చేసే సినిమాల కోసం..

ఒరిజినల్ వెర్షన్ లను ఓటీటీలో అందుబాటులో లేకుండా చేసే అవకాశం లేదు. అందుకే నాగ్ (Nagarjuna) సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’ విషయంలో కూడా అంతే జరుగుతుంది. ‘విన్సిడా’ అనే ఓ బెంగాలీ చిత్రానికి అది రీమేక్. అయినా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. నిర్మాతలు కూడా రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus