Nagarjuna: నాగార్జున మైల్‌ స్టోన్‌ సినిమా ఆలోచనలు ఇవేనా!

  • March 1, 2022 / 01:28 PM IST

నాగార్జున కెరీర్‌లో మైలురాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ది ఘోస్ట్’ 99వ సినిమా. దీని బట్టి అర్థమయ్యే ఉంటుంది. మేం ఏం మైలురాయి గురించి మాట్లాడుతున్నామో. అవును అదే #Nag100. నాగార్జున వందో చిత్రం గురించే మేం చెబుతున్నది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి జరుగుతున్న చిన్నపాటి చర్చ… ఇప్పుడు కాస్త పెద్దదిగా మారింది. వాటి ప్రకారం చూసుకుంటే… నాగ్‌ వందో సినిమా బడ్జెట్‌ సుమారు ₹100 కోట్లు అని టాక్‌. ఇందులో నిజానిజాలు తెలియదు కానీ… టాక్‌ అయితే నడుస్తోంది.

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్‌’ చేస్తున్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇటీవల చిత్రీకరణ అనుకున్నప్పటికీ… అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేశారు. త్వరలో సినిమా షూట్‌ ప్రారంభిస్తారట. ఈ విషయం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు వందో సినిమా గురించి చూద్దాం. చిరంజీవితో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా తెరకెక్కిస్తున్న మోహన్‌ రాజా… ఇటీవల నాగార్జునను కలిశారని టాక్‌. ఓ సినిమా కథ కోసం ఈ మీటింగ్‌ అని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

నాగార్జునకు మోహన్‌ రాజా ఓ మల్టీస్టారర్‌ కథ చెప్పారని… నాగ్‌కి ఆలోచన నచ్చిందని అంటున్నారు. ఇందులో మరో హీరోగా అఖిల్‌ను తీసుకుంటారనే మాటలూ వినిపిస్తున్నాయి. తండ్రీకొడుకుల సినిమా కావడం, ప్రతిష్ఠాత్మక 100వ సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ అనుకుంటున్నారు. సినిమా కథ కూడా ఆ మాత్రం బడ్జెట్‌ను కోరుకుంటుందట. అంత బడ్జెట్‌ పెడుతున్నారు, అందులోనూ ఇది పాన్‌ ఇండియా సీజన్‌ కావడంతో… అక్కినేని తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే అవుతుందని సమాచారం.

అఖిల్‌ సంగతి చూస్తే… ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మోహన్‌రాజా సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే వందో సినిమాను నాగ్‌… విక్రమ్‌ కె కుమార్‌తో అనుకుంటున్నారని గతంలో వార్తలొచ్చాయి. మరి ఏది నిజమవుతుందో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus