Nagarjuna: కొత్త సినిమాతో నాగ్ అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చడం ఖాయమేనా?

స్టార్ హీరో నాగార్జున నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలైతే కచ్చితంగా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్నాయి. నాగార్జున విజయ్ బిన్ని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. నా సామిరంగ సెట్స్ నుంచి నాగ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ఫోటో చూసిన నెటిజన్లు నాగార్జున మాస్ లుక్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఆకలిని నా సామిరంగ సినిమా తీర్చడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పోరింజు మరియమ్ జోస్ కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నున్నగా అదిమిన జుట్టుతో సరికొత్త గెటప్ లో నాగ్ అదరగొడుతున్నారు. నాగ్ అప్పటికి ఇప్పటికీ మన్మధుడే అని నాగార్జునకు వయస్సు అనేది జస్ట్ నంబర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా సినిమాకు లుక్ విషయంలో వైవిధ్యం చూపిస్తున్న నాగ్ ఘోస్ట్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కాగా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి రేసులో విజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాత కాగా ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ అందించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఊరమాస్ అవతార్ లో నటిస్తున్న (Nagarjuna) నాగ్ త్వరలో సంక్రాంతి కానుకగా ఏ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారో క్లారిటీ ఇవ్వనున్నారు. 2024 సంవత్సరం ఈ అక్కినేని హీరోకు కలిసిరావాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. నా సామిరంగ బిజినెస్ లెక్కల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజవుతున్న సినిమలలో కొన్ని సినిమాలకు ఇప్పటికే బిజినెస్ పూర్తైందని తెలుస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus