అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇటీవల ‘కుబేర’ తో ప్రేక్షకులను పలకరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అతి త్వరలో ఆయన ‘కూలీ’ తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటి తర్వాత నాగార్జున (Nagarjuna) తన 100వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారు. కోలీవుడ్ దర్శకుడు రా.కార్తీక్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ ప్రాజెక్టు.
తమిళంలో ఒకే ఒక్క సినిమా తీసిన రా. కార్తీక్ కి తన ల్యాండ్ మార్క్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అయినా సరే నాగార్జునకి ఇలాంటి రిస్క్..లు కొత్తేమీ కాదు. కొత్తదనాన్ని, కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడానికి నాగ్ ఎప్పుడూ ముందుంటారు. పైగా ల్యాండ్ మార్క్ మూవీ అంటే కచ్చితంగా అన్నీ దగ్గరుండి చూసుకోవాలి.
అందుకే నాగ్ ఈ కొత్త దర్శకుడితో ట్రావెల్ అవ్వడానికి డిసైడ్ అయ్యుంటారు. ఇక అటు తర్వాత నాగార్జున ఓ రీమేక్ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.అది కూడా తమిళ రీమేక్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. 2023 లో శశి కుమార్ హీరోగా ‘అయోతి’ అనే సినిమా వచ్చింది. ఇదో మెలోడ్రామాటిక్ సినిమా. అక్కడ బాగానే ఆడింది.
మంత్రిరామూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. నాగ్ ఏజ్ కి ఇమేజ్ కి కూడా ఇది సూట్ అవుతుంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.