బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఆదివారం నాగార్జున హౌస్ మేట్స్ అందర్నీ పలకరించాడు. ఆ వారం ఎవరెవరు గేమ్ ఎలా ఆడారు అనేది దానిపైన తనదైన స్టైల్లో మాట్లాడాడు. బ్యాలెట్ బాక్స్ తీస్కుని అసలు సిసలైన ఇరిటేషన్ పర్సన్ ఎవరు ? ఫేక్ పర్సన్ ఎవరు అనేది క్లియర్ గా చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ మద్యలో చిచ్చుపెట్టినట్లుగా అయ్యింది. నిజానికి సీక్రెట్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ఎవరికి ఓటు వేసినా కూడా యాంకర్ శివ వేసిన ఓటుని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీస్కున్నాడు బిగ్ బాస్.
Click Here To Watch NEW Trailer
అయితే, స్టేజ్ పైన నాగార్జున అసలు రిజల్డ్స్ ని ఎనౌన్స్ చేశాడు. ఇందులో ఫస్ట్ ఇరిటేషన్ పర్సన్ ఎవరు వచ్చారో చెప్పాడు. హౌస్ మేట్స్ లో ఐదుగురు కలిసి ఓటు వేసి ఆర్జే చైతూని ఇరిటేషన్ పర్సన్ గా ఎంచుకున్నారని అన్నాడు. అంతేకాదు, ఆ తర్వాత అసలు హౌస్ లో ఫేక్ పర్సన్ సరయు అని, సరయుకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పాడు. ఇక యాంకర్ శివ హౌస్ లో ఇరిటేషన్ చేస్తున్నాడా అంటూ హౌస్ మేట్స్ ని ప్రశ్నించాడు. దీంతో అషూరెడ్డి కాసేపు శివతో ఆడుకుంది.
అంతేకాదు, ఇక్కడే యాంకర్ శివ తో కాసేపు నాగార్జున పంచ్ లు వేశాడు. ఫిమేల్ కంటెస్టెంట్స్ అందర్నీ పైకి లేపి ఎవరిని మీరు షర్ట్ లేకుండా చూడాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాడు. ఇక అందరూ మెజారిటీగా శివని ఎంచుకున్నారు. దీంతో శివ ఎపిసోడ్ లో కాసేపు షర్ట్ లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడే నాగార్జున ఇరిటేషన్ పర్సన్ అంటూ రెండు మూడు సార్లు శివని పిలిచాడు. అసలు హౌస్ లో తనకి తానే ఇరిటేషన్ పర్సన్ అని శివ ఓటు వేసుకోవడం వల్లే అలా అయ్యాడు.
సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఇలా చేయడం వల్ల తనపై హౌస్ మేట్స్ కి అనుమానం రాలేదు. ఇదే విషయాన్ని నాగార్జున రివీల్ చేశాడు. చాలా తెలివిగా గేమ్ ఆడావ్ అని అప్రిషియేట్ చేశాడు. కాసేపు షర్ట్ లేకుండా కూర్చున్న శివని హౌస్ మేట్స్ ఆటపట్టించారు. హోలీ పండగ సందర్బంగా హౌస్ మేట్స్ అసలు రంగులు బయటపెట్టే గే్మ్ ని ఆడించిన నాగార్జున ఆ తర్వాత ఎక్కువసార్లు డ్రింక్ తాగిన శివని కనికరించి షర్ట్ వేసుకోమని చెప్పాడు. దీంతో శివ ఊపిరి పీల్చుకున్నాడు.
మొత్తానికి ఎపిసోడ్ లో నాగార్జున శివని ఇరిటేషన్ గై అంటూ టీజ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో హౌస్ అంతా చాలా సరదాగా గడిచిపోయింది. హౌలీ పండగ సందర్భంగా స్పెషల్ సాంగ్స్ తో, శ్రధ్దాదాస్ డ్యాన్స్ తో స్టేజ్ దద్దరిల్లిపోయింది. అదీ మేటర్.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!