మరోసారి సతీమణితో కలిసి నటించబోతున్న నాగ్..!

నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం అందరికీ ‘హాట్ ఫేవొరెట్’ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ సంభాషణలు… బ్రహ్మానందం కామెడీ… నాగార్జున గ్లామర్.. అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని ‘ఆల్ టైం హిట్’ గా నిలిపాయి. ఇప్పటికీ ఈ చిత్రాన్ని టీవీల్లోనూ… యూట్యూబ్ లోనూ జనాలు చూస్తూనే వున్నారు. ఈ చిత్రం నిజంగానే నాగార్జునని టాలీవుడ్ మన్మథుడుగా నిలబెట్టేసింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

‘చి ల సౌ’ వంటి డీసెంట్ హిట్ సాధించిన నటుడు,దర్శకుడు.. అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. హీరోయిన్లుగా అనుష్క, పాయల్ రాజ్ పుత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘మన్మధుడు’ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ నే.. ‘మన్మధుడు2’ కి సంగీత దర్శకుడిగా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే వరుస చిత్రాలతో దేవి శ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నాడు… ఒకవేళ దేవి శ్రీ కన్ఫర్మ్ కాకపోతే గోపి సుందర్ ని ఫైనలైజ్ చేసే అవకావం ఉందట. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నాగార్జున సతీమణి ‘అమల’ కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. నాగార్జునతో వివాహమైన తరువాత అమల సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘మనం’ వంటి చిత్రాలలో మాత్రమే నటించారు. ఇప్పుడు ‘మన్మథుడు 2’లో ఓ అతిథి పాత్రలో ఆమె కనిపించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus