అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్య కృష్ణ , కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అధికారికంగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ వేడుకలో హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ…మీడియా వారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి .. ‘ మీడియా వారందరికీ నమస్కారం ఇప్పటి వరకు విడుదలైన పాటలు అన్నిటినీ ఆదరించారు.
ఈ పాటని కూడా ఆదరించండి అంటూ హీరోయిన్ బంగార్రాజు టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించారు.అనంతరం… నాగలక్ష్మి పాత్ర ఓ పటాకలా ఉంటుంది. చాలా హుషారుగా ఉండే అమ్మాయి.ఈ చిత్రంలో నేను సర్పంచ్ గా కనిపిస్తున్నాను అని తెలిసినప్పటి నుండీ చాలా ఎక్సైట్ అయ్యాను. నాగ చైతన్య గారితో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. నాగార్జున సార్ నిజంగా కింగ్. కళ్యాణ్ కృష్ణ గారు సినిమాని చాలా బాగా తీశారు.
ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ ..” తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ టీం సహకారం వల్ల అది సాధ్యమైంది. కాబట్టి నటీనటులకు అందరికీ థాంక్స్. జీ స్టూడియోస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ..కళ్యాణ్ కృష్ణ గారితో ఇది మా మూడో కాంబినేషన్. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. నాగార్జున గారికి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. నిజంగానే ఇది పండుగ లాంటి సినిమా.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ..”జనవరి 14 న బంగార్రాజు ని విడుదల చేస్తున్నాం.2021 ఆగస్ట్ 25 న సినిమా షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్ 25 కి కంప్లీట్ చేసేసాము. ఇది టోటల్ టీమ్ క్రెడిట్. ఈ సినిమాలో 20 సెట్స్ ఉంటాయి. అనూప్ అందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. ఇది పండుగ లాంటి సినిమా అని షూటింగ్ మొదలైనప్పటి నుండీ చెబుతూనే ఉన్నాం. ఆగస్ట్ 25 న షూటింగ్ ప్రారంభమైంది అప్పటి నుండీ ఇది సంక్రాంతికి రిలీజ్ ఇవ్వగలమా లేదా అనే డౌట్ మాలో ఉంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ అనేది పడకుండా అన్ని పరిస్థితులు సహకరిస్తే సినిమా జనవరి 14 న కచ్చితంగా ఈ చిత్రం విడుదల అవుతుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అండ్ మా టీమ్ అందరికీ సినిమా రిలీజ్ అయ్యాక థాంక్స్ చెబుతాను. మా సినిమాలో 35 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుంది. అది ఫినిష్ చేయడం మామూలు విషయం కాదు. నాగ చైతన్య డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉండి ఈ వేడుకకి రాలేదు.
ఆర్.ఆర్.ఆర్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్ .. అది ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా రిలీజ్ కరెక్ట్ కాదు.రాధే శ్యామ్ విషయంలో కూడా అంతే. ఆ సినిమాల విషయంలో ఆ టీమ్ లు ఎంత కష్టపడ్డాయి అనే విషయం నాకు తెలుసు. ఆ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం నాకు ప్లస్ అయ్యిందా లేదా అనేది నా సినిమా విడుదల అయ్యి వచ్చే ఫలితాన్ని బట్టి చెబుతాను.మా సినిమా శివుడితో రిలేట్ అయిన సినిమా.. శివుడి ఆజ్ఞ ఉంటే మా సినిమా ఇప్పుడు అనౌన్స్ చేసిన టైం కి రిలీజ్ అవుతుంది. ఒమిక్రాన్ భయం ఉంది.
కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ కచ్చితంగా మా సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం కూడా బలంగా ఉంది.భయం భయంగానే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాం. సంక్రాంతికి సినిమాలు ఉంటేనే బాగుంటుంది అని అంతా కోరుకుంటున్నారు.నాకు ఊహ తెలిసినప్పటి నుండీ మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి.ఈసారి కూడా అలా ఉంటేనే బాగుంటుంది. బంగార్రాజు లో ఏడుగురు హీరోయిన్స్ ఉన్నారు. అది మీరు సినిమాలోనే చూడాలి నేను ఎక్కువ చెప్పకూడదు. లడ్డుండ అనే పాట చాలా కష్టపడి పాడాను.100 వ సినిమా గురించి ఇంకా లెక్కేలేసుకోలేదు.. గెస్ట్ రోల్ తో కలుపుకుని చెయ్యాలా లేక సోలో హీరోగా లెక్కేసుకుని చెయ్యాలా అనేది చూడాలి.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…”నాగ్ సార్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సోగ్గాడే టైంలో నాగ్ సార్ చెప్పారు..దీనికి సీక్వెల్ చేయాలని. ఇది బలమైన సంకల్పం వల్ల సాధ్యమైంది.కృతి శెట్టి ఓ కాలేజ్ స్టూడెంట్ లా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాలో నటించింది.చైతన్య ఈ సినిమాలో గత సినిమాల కంటే కూడా కొత్తగా కనిపిస్తారు. అతని ఎనర్జీ సూపర్. అతని పెర్ఫార్మెన్స్ చూసి సెట్స్ లో ఉన్నవాళ్ళంతా 10 సార్లు క్లాప్ కొట్టారు.రమ్యకృష్ణ గారు.. గ్రేట్ యాక్ట్రెస్… కామెడీ అయినా ఎమోషన్ అయినా ఏదైనా ఆవిడ పండించే విధానం దర్శకుడికి సహకరించే విధానం మాటల్లో వర్ణించలేనిది.సోగ్గాడే చిన్ని నాయన మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో.. బంగార్రాజు అంతకు మించి ఎంటర్టైన్ చేస్తుంది.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..”నాగ్ సార్ కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. మనం, సోగ్గాడే చిన్ని నాయన ఇప్పుడు బంగార్రాజు సినిమాలకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్లే. వాటిని దృష్టిలో పెట్టుకొని బంగార్రాజు కి మరింత కష్టపడి చేశాం. ఇప్పుడు వాటికి దక్కుతున్న ప్రేక్షకాదరణ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే బంగార్రాజు ఆల్బమ్ ఇంత బాగా వచ్చింది.