సంక్రాంతి రేసు నుండీ నాగార్జున ఔట్..!

2020 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కర్చీఫ్ వేసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళతో పాటు సాయి తేజ్, మారుతీ కాంబినేషన్లో రాబోతున్న ‘ప్రతీరోజు పండగే’, రజనీకాంత్ -మురుగదాస్ ల దర్బార్ అలాగే నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాలు వస్తాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ రేస్ నుండీ నాగార్జున తప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకన్నాడు నాగ్. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లోనే… ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ను దింపాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడట.

జూలై నుండీ దాదాపు మూడు నెలల వరకూ నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీగా ఉండబోతున్నారు. మరోపక్క ‘వెంకీ మామ’ చిత్రంతో చైతన్య బిజీగా ఉంటాడట.. దాంతోపాటు శేఖర్ కమ్ములతో చేసే సినిమా కూడా లైన్లో ఉంది. దీంతో ‘బంగార్రాజు’ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ఫిక్సయ్యాడట నాగార్జున. ఇక నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు2’ చిత్రం ఆగష్టు 9 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus