Nagarjuna, Naga Chaitanya, Samantha: నాగార్జున ఎమోషనల్ పోస్ట్!
- October 3, 2021 / 06:11 AM ISTByFilmy Focus
నాగచైతన్య-సమంతల సెపరేషన్ పై నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని.. చై-సామ్ లు విడిపోవడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. భార్యా భర్తల మధ్య ఏం జరిగినా.. అది వాళ్ల వ్యక్తిగతమని చెప్పారు. సమంత-చైతు తనకు చాలా ప్రియమైన వ్యక్తులని అన్నారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైనది.. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని.. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో చైతుకి తోడుగా మీరే ఉండాలంటూ నాగార్జునకి చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నాగచైతన్య-సమంతలు వార్తలు వినిపించినా.. అవి నిజం కాకూడదని అభిమానులు కోరుకున్నారు. కానీ ఈరోజు స్వయంగా చైతు-సామ్ ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021
రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

















