‘కింగ్’ నాగార్జున (Nagarjuna) ఓ బ్లాక్ బస్టర్ అందుకుని చాలా కాలం అయ్యింది. ‘బంగార్రాజు’ (Bangarraju) ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) సినిమాలు పర్వాలేదు అనిపించినా.. కంటెంట్ పరంగా పూర్తిస్థాయిలో అభిమానులను సంతృప్తి పరిచిన సినిమాలు కావు. ‘ఆఫీసర్’ (Officer) ‘దేవదాస్’ (Devadas) ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) ‘వైల్డ్ డాగ్’ (Wild Dog) ‘ఘోస్ట్’ (The Ghost) వంటివి బాగా నిరాశపరిచాయి. నాగార్జున మార్కెట్ ను కూడా దెబ్బతీశాయి. సో ఇప్పుడు మళ్ళీ కింగ్ తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. తన ఇమేజ్ కి సరిపడా కథ దొరికే వరకు గ్యాప్ తీసుకోకుండా…
సినిమా కథను ముందుకు తీసుకెళ్లే ఎలాంటి పాత్రలైనా చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ‘బ్రహ్మాస్త్ర’ చేశారు. అందులో నాగ్ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.ప్రస్తుతం ‘కుబేర’ (Kubera) ‘కూలి’ (Coolie) వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు నాగార్జున. ‘కుబేర’ లో ధనుష్ తో (Dhanush) కలిసి నటించబోతున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి.కానీ అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు ‘కుబేర’ తో ఈ కాంబో సెట్ అయ్యింది.
‘ఏషియన్ సంస్థ’ నిర్మిస్తోంది. ధనుష్ హీరో అయినప్పటికీ.. ఈ సినిమాలో ఎక్కువగా నాగార్జున పాత్రే కనిపించబోతుంది అనేది ఇన్సైడ్ టాక్. నాగార్జున ఏజ్ కి సరిపడే పాత్ర ఇది అని కూడా అంటున్నారు. అయితే ఇలాంటి పాత్ర కోసం నాగార్జున ఎంత పారితోషికం అందుకున్నారు అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కుబేర’ కోసం నాగార్జున రూ.14 కోట్లు పారితోషికం అందుకున్నారట.