Nagarjuna, Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున అంత త్యాగం చేశాడా.. బయటపడిన నిజం!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి మెగా ఫ్యామిలీ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి మరియు నాగార్జున ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఉంటారు. ఆయనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా నాగార్జున పబ్లిక్ స్టేజి మీద అన్నయ్య అని పిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని కూడా నాగార్జున తన సొంత కొడుకులాగానే భావిస్తాడు.

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ఒక రోజు చరణ్ వచ్చినప్పుడు మా అన్నయ్య కొడుకు, సంస్కారానికి పెట్టింది పేరు లాంటోడు అని ఎంతో గొప్పగా మాట్లాడుతాడు నాగార్జున. ఈ వీడియో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే చిరంజీవి కుటుంబం లో నాగార్జున కి అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది కానీ, పవన్ కళ్యాణ్ ని మాత్రం పెద్దగా కలిసింది లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగార్జున.

అయితే ఒకానొక సందర్భం లో పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున తన తమ్ముడిని కూడా వదిలేసుకున్నాడు అట. తమ్ముడు అంటే నిజం తమ్ముడు అనుకునేరు, కాదండి బాబోయ్!. నాగార్జున అప్పట్లో తానూ నటించబోయే కొత్త సినిమాకి ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్. ఆ టైటిల్ ని నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో చెయ్యబోతున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించాడు. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా డైరెక్టర్ అరుణ్ కుమార్ అదే టైటిల్ ని పెట్టాలని అనుకున్నాడు.

అప్పటికే నాగార్జున (Nagarjuna) గారు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించి ఉన్నారని పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఆయన వెంటనే నాగార్జున గారికి కాల్ చేసి, మేము చేస్తున్న సినిమాకి ఈ టైటిల్ చాలా యాప్ట్ అండీ, దయచేసి మాకు వదిలేయగలరా అని అడగగా, వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడట నాగార్జున. అలా పవన్ కళ్యాణ్ తో పెద్దగా పరిచయం లేకపోయినా కూడా అడగగానే ఇచ్చేశాడంటే నాగార్జున కి ఎంత మంచి మనసు ఉందొ అర్థం చేసుకోవచ్చు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus