నాగార్జున సెటైర్లు..వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ తో ఒక ఆట అడుకున్నాడుగా..!

బిగ్ బాస్ హౌస్ లో కింగ్ నాగార్జున శనివారం వస్తున్నాడంటే హౌస్ మేట్స్ కి దడదడ అనే చెప్పాలి. ఎందుకంటే, ఎవరికి క్లాస్ పీకుతాడు, ఎవరిని మెచ్చుకుంటాడో ఊహించలేరు. టాస్క్ లు ఆడేటపుడు ఎవరికి వారే వాళ్లది కరెక్ట్ అనే భావనలో ఉంటారు. అప్పుడు నాగార్జున చెప్పిందే వాళ్లు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక ఈవారం నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. ప్రతి పాయింట్ లో పంచ్ లు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా సిరికి, షణ్ముక్ కి, కాజల్ కి పంచ్ లు పడుతూనే ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ గా శ్రీరామ్ ని అభినందించాడు. శ్రీరామ్ చంద్రని సేఫ్ చేసి ఫైనలిస్ట్ గా ఎనౌన్స్ చేశాడు.

ఇంటిసభ్యులతో ఎవరిమీద అయినా కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ బాక్స్ లో వేయాలని చెప్పాడు నాగార్జున. దీంతో ఒకరి పేరు ఒకరు రాసి కంప్లైంట్ బాక్స్ లో వేశారు. సన్నీ సిరిపైన ఫిర్యాదు చేశాడు. మానస్ షణ్ముక్ పైన ఫిర్యాదు చేశాడు. పింకీ సన్నీ పైన, కాజల్ సన్నీపైన కంప్లైంట్స్ ఇచ్చారు. ఇక్కడే హౌస్ మేట్స్ కి చురకలు అంటించాడు నాగార్జున. తనకి కూడా కంప్లైంట్స్ ఉన్నాయంటూ సెటైర్లు వేశాడు. సిరితో మాట్లాడుతూ నువ్వు ఫ్రెండ్ గా ఉండటానికి సిగ్గుపడుతున్నా అంటూ షణ్ముక్ పై కౌంటర్ వేశాడు. అంతేకాదు, ఆ తర్వాత ఫ్రెండ్లీ హగ్ కూడా ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్ అంటూ సైటెర్ వేశాడు కింగ్ నాగ్.

ప్రియాంకకి సొంతవైద్యం చేయద్దు అంటూ చురకలు అంటించారు. కేవలం బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, మరెక్కడా కూడా సొంతవైద్యం చేయద్దు అంటూ క్లాస్ పీకాడు. సన్నీది, సిరిది ఐస్ టబ్ టాస్క్ లో ఎవరిది మిస్టేక్ ఉందో చూడండి అంటూ వీడియోస్ చూపించారు. ఇద్దరూ కూడా కాల్ పెట్టే టైమ్ బాల్ తీసే టైమ్ ఒకేలా ఉన్నాయి. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

ఇక శ్రీరామ్ చంద్రని కూడా మందలించాడు. బల్బ్ టాస్క్ ఆడేటపుడు నువ్వు ఎందుకు చెప్పావ్ ? నీ తరపున షణ్ముక్ ఆడుతున్నప్పుడు నువ్వు అలా చెప్పకూడదు కదా అంటూ మాట్లాడాడు. ఒక బల్బ్ ఆరిపోయి ఉంది, అది చూడకుండా బజర్ కొడుతుంటే చెప్పానని అన్నాడు శ్రీరామ్. దానికి అలా చెప్పడం కరెక్ట్ కాదంటూ మందలించాడు నాగార్జున. ఆ తర్వాత సిరి సౌండ్స్ రాయడంపై కౌంటర్స్ పేలాయి. హెలికాఫ్టర్ సౌండ్ ని ట్రాక్టర్ అన్నావ్ అంటూ ఫన్ చేశాడు. ఇక కాజల్ ని ఏడిపించిన సన్నీతో సారీ చెప్పించాడు నాగార్జున. ఎపిసోడ్ అంతా ఇలా హౌస్ మేట్స్ కి కౌంటర్స్ పడుతూనే ఉన్నాయి.

Share.