ధనుష్ (Dhanush) – నాగార్జున (Nagarjuna) – దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. చాలా కాలంగా సరైన సినిమా లేక థియేటర్లకు రాని జనాలను కొంతవరకు ఈ సినిమా రప్పించింది అనే చెప్పాలి. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీకెండ్స్ లో ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది.
మూడో వీకెండ్ కూడా పర్వాలేదు అనిపించింది. తమిళంలో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో లాభాలు తెచ్చిపెట్టి కవర్ చేసింది. ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.46 cr |
సీడెడ్ | 4.60 cr |
ఉత్తరాంధ్ర | 5.75 cr |
ఈస్ట్ | 2.77 cr |
వెస్ట్ | 1.62 cr |
గుంటూరు | 2.27 cr |
కృష్ణా | 2.36 cr |
నెల్లూరు | 1.25 cr |
ఏపీ+తెలంగాణ | 37.08 cr |
తమిళనాడు | 10.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.76 cr |
ఓవర్సీస్ | 16.58 cr |
వరల్డ్ టోటల్ | 70.83 cr (షేర్) |
‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 17 రోజులకు గాను రూ.70.83 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.120.72 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.10.83 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించింది. మూడో వీకెండ్ లో కూడా కోటి పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది.