Bigg Boss 7 Telugu: అమర్ చేసిన పనివల్లే ప్రియాంక దొరికిపోయిందా ? నాగ్ సార్ చూపించిన వీడియో ఏంటి ?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటే హౌస్ మేట్స్ కి టెన్షన్, ఆడియన్స్ కి అటెన్షన్. ఇందులో భాగంగా సీజన్ చివరికి వచ్చేసింది కాబట్టి ఎవ్వరికీ క్లాస్ పడదని చాలా ధీమాగా ఉన్నారు హౌస్ మేట్స్. కానీ, ప్రియాంకకి మాత్రం నాగ్ సర్ ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు. అమర్ కి పాయింట్స్ ఇవ్వడంలో ప్రియాంక ఫస్ట్ లో నిరాకరించింది. గౌతమ్ కి తన పాయింట్స్ ని గ్రాటిట్యూడ్ అంటూ ఇచ్చింది.

కానీ, ఆ తర్వాత గౌతమ్ గేమ్ లో నుంచీ అవుట్ అవుతుంటే, అమర్ కి ఇమ్మని బ్రతిమిలాడింది. దీంతో ఈవిషయాన్ని నాగార్జున చాలా సీరియస్ గా తీస్కున్నారు. ఇండివెడ్యువల్ గేమ్ ఆడుతున్నావా ? గ్రూప్ గా ఆడుతున్నావా అని ప్రశ్నించారు. అంతేకాదు, అమర్ ఎమోషనల్ గా బ్లాక్ మైయిల్ చేశాడా అని కూడా ప్రశ్నించారు. అలాగే, బాస్కెట్ లో బాల్ వేసే టాస్క్ లో ఎందుకు ఓడిపోయావని అనుకుంటున్నావ్ అని అడిగారు. అప్పుడు అమర్ దీప్ ప్రియాంక నుంచీ బాల్ లాగేస్కున్న సంగతి తెలిసిందే.

దీన్ని మళ్లీ ఒక్కసారి ప్రశ్నించారు. సంచాలక్ పెట్టిన రూల్ వల్ల ఓడిపోయా అంటూ జవాబు నవ్వుతూ చెప్పింది ప్రియాంక. అంతేకాదు, ఆ బాధతోనే అమర్ కి కాకుండా గౌతమ్ కి పాయింట్స్ ఇచ్చావని అడిగాడు. అదేమీ లేదని, తనని గతవారం కెప్టెన్ ని చేశాడు కాబట్టి నేను గ్రాటిడ్యూడ్ తో గౌతమ్ కి పాయింట్స్ ఇచ్చానని చెప్పింది ప్రియాంక. ఎమోషనల్ బ్లాక్ మైయిల్ చేశాడని, అసలు నువ్వు ఎందుకు పాయింట్స్ ఇచ్చావో అస్సలు శోబాకి అర్దం కాలేదని చెప్తూ స్టేజ్ పైన నాగార్జున లాక్ చేసే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు, రాత్రి పూట గౌతమ్ దగ్గరకి వెళ్లి ప్రియాంక బ్రతిమిలాడిన వీడియో, బాత్రూమ్ లో బాధపడిన వీడియోని కూడా చూపించినట్లుగా సమాచారం. అంతేకాదు, ఇదే విషయంలో అమర్ కి సైతం క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. అమర్ – గౌతమ్ – ప్రియాంక ముగ్గురికీ కూడా నాగార్జున తనదైన స్టైల్లో క్లాస్ పీకారు. అమర్ రెండు టాస్క్ లు మాత్రమే గెలిచి పాయింట్స్ లో టాప్ లో ఎలా ఉన్నావో తెలుసా అంటూ ప్రశ్నించారు.

ఈ ఫినాలే టిక్కెట్ టాస్క్ లో అస్సలు పెర్పామ్ చేయని శివాజీని, శోభాని కూడా ప్రశ్నించారు. ఇక అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఈవారం సేఫ్ అవుతూ టాప్ 5లోకి వెళ్లిపోయాడు. అలాగే, పల్లవి ప్రశాంత్ ఆడిన తీరుని కూడా మెచ్చుకున్నారు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ (Bigg Boss 7 Telugu) అనేది ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus