Ashu Reddy: బాబాభాస్కర్ ఇచ్చే ట్విస్ట్ అదే అని చెప్పిన నాగార్జున..! ఎందుకంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ తెలుసు సీజన్ 1 సండే రోజున హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. లాస్ట్ టైమ్ టెలివిజన్ సీజన్ కంటే కూడా బెటర్ గా యాంకరింగ్ చేస్తూ బిగ్ బాస్ లవర్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈవారం కూడా నాగార్జున తనదైన స్టైల్లో హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతూ , టీజ్ చేస్తూ రెచ్చిపోయారు. ముఖ్యంగా బిందుకి, అఖిల్ కి జరిగిన గొడవలో ఎవరు రాంగ్ గా ఊహించుకున్నారో వీడియో ప్రూఫ్ తో సహా క్లారిటీ ఇచ్చేశారు.

Click Here To Watch NOW

ఒక ఇష్యూలో బిందు కరెక్ట్ అయితే, ఇంకో ఇష్యూలో బిందు రాంగ్ అని తేలింది. దీంతో బిందు అఖిల్ కి సారీ చెప్పింది. ఇక బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చాడని, రావడంతో బిందుని సేఫ్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఈవారం వెళ్లిపోతూ ఒకర్ని తీస్కుని వెళ్లిపోతారని చెప్పాడు. బాబాభాస్కర్ ని మీరు హౌస్ లో నుంచీ ఎవరిని తీసుకుని వెళ్లిపోతారో చెప్పమని అడిగితే, బాబాభాస్కర్ అషూరెడ్డి పేరు చెప్పాడు. దీంతో అషూరెడ్డితో కాసేపు ఆడుకున్నాడు హోస్ట్ నాగార్జున.

నేను నీకోసం స్టేజ్ పైన వెయిట్ చేస్తుంటానని, బాబాభాస్కర్ తో పాటుగా వచ్చేయమని చెప్పాడు. నిజానికి హౌస్ మేట్స్ అంతకుముందు ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. బాబాభాస్కర్ అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదని, ఒకరిని సేఫ్ చేశాడు కాబట్టి, ఇంకొకరిని ఎలిమినేట్ చేసి తీస్కుని వెళ్లిపోతారని అభిప్రాయపడ్డారు. హమీదా, అరియానా, అషూరెడ్డి వీళ్లు గెస్ వర్క్ చేశారు. వాళ్లు ఊహించినట్లుగానే నాగార్జున కూడా మాట్లాడేసరికి అషూరెడ్డి షాక్ అయిపోయింది. చాలాసేపటి వరకూ నిజమే అని నమ్మేసింది. బాబాభాస్కర్ ఇచ్చే ట్విస్ట్ ఇదే అని నాగార్జున చాలా సీరియస్ గా చెప్పాడు.

బిందుని సేఫ్ చేశాడు. ఇప్పుడు వెళ్లిపోయేటపుడు అషూని బయటకి తీస్కుని వస్తాడు అంటూ చెప్పి గేమ్ లో ముందుకు వెళ్లారు. ఆ తర్వాత బ్రేక్ టైమ్ లో అషూరెడ్డి తన ఆవేదనని అఖిల్ కి చెప్పుకుంది. ఇది చాలా అన్ ఫెయిర్ అంటూ మొత్తుకుంది. కానీ, అఖిల్ అలా చేయరని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. బ్రేక్ తర్వాత కొద్దిసేపు అషూరెడ్డిని ఆటపట్టించిన కింగ్ నాగార్జున చాలాసేపు సస్పెన్స్ తర్వాత అషూరెడ్డికి క్లారిటీ ఇచ్చాడు కింగ్ నాగార్జున.

ఆయన ఎక్కడికి వెళ్లరని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లో ఉండటానికి వచ్చాడని చెప్పాడు. దీంతో అషూరెడ్డి ఊపిరి పీల్చుకుంది. ఇక ఎలిమినేషన్ రౌండ్ లో లాస్ట్ వరకూ టెన్షన్ గా వచ్చింది అషూరెడ్డి. అజయ్, అషూ ఇద్దరూ ఉన్నప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని హౌస్ అంతా ఆసక్తిగా చూశారు. అజయ్ ఎలిమినేట్ అయ్యేసరికి ఒక్కసారి షాక్ తిన్నారు. అషూరెడ్డి అయితే, చాలాసేపు ఏడూస్తూ బాధపడింది. స్పెషల్ బాండింగ్ అజయ్ తోనే ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus