Nagarjuna: ‘ఘోస్ట్’ దుబాయ్ షెడ్యూల్ క్యాన్సిల్!

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ది ఘోస్ట్’. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 3 నుంచి షూటింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా దుబాయ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అంతా రెడీ అనుకున్న సమయానికి చిత్రబృందంలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో దుబాయ్ షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తరువాత కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది.

Click Here To Watch

నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించనున్నారు. దీనికోసం విదేశాల నుంచి యాక్షన్ డైరెక్టర్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు నటి సోనాల్ చౌహాన్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో నటించనుంది. ఈ సినిమాలో గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ కీలపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్ కూడా బయటకొచ్చింది.

కథ ప్రకారం సినిమాలో నాగ్ ‘రా’ ఆఫీసర్ గా కనిపిస్తారట. నిజానికి ఈ సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె గర్భవతి కావడంతో ‘ఘోస్ట్’ నుంచి తప్పుకుంది. ఆ తరువాత అమలాపాల్ ని అనుకున్నారు. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఫైనల్ గా సోనాల్ చౌహాన్ ను ఓకే చేశారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus