Nagarjuna, Chiranjeevi: ది ఘోస్ట్ రిలీజ్ డేట్ మారుతుందంటూ ప్రచారం.. కానీ?

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మొదట నాగ్ దసరా కానుకగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించగా ఆ తర్వాత గాడ్ ఫాదర్ మేకర్స్ సైతం అదే తేదీన తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇండస్ట్రీలో రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఇద్దరు హీరోలకు మంచిది కాదు.

నిజ జీవితంలో చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలలో ఏ ఒక్కరు వెనక్కు తగ్గినా రెండు సినిమాలకు బెనిఫిట్ కలుగుతుంది. అయితే గాడ్ ఫాదర్ మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్ ను మార్చే అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. నాగ్ తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రీ పోన్ చేయడం లేదా పోస్ట్ పోన్ చేయడం చేస్తే బాగుంటుందని విశ్లేషకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ది ఘోస్ట్ రిలీజ్ డేట్ మారుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ నెల 7వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి ది ఘోస్ట్ చిత్రయూనిట్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఒకేరోజు విడుదలైతే మాత్రం నాగ్ సినిమానే ఎక్కువగా నష్టపోతుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ది ఘోస్ట్ మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా నాగార్జున కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. సోలో హీరోగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వయస్సుకు తగిన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ నాగార్జున కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus