నాగార్జున – ప్రసన్న కుమార్ కాంబో మూవీలో హీరోయిన్ ఫిక్స్..!

అక్కినేని నాగార్జున గతేడాది 3 ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా చేసిన ‘బంగార్రాజు’ కాగా ఇంకోటి బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అనీష్ శెట్టి అనే పాత్రలో స్పెషల్ రోల్ చేశారు. ఇక సోలో హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున..

చాలా మంది దర్శకులు చెప్పిన కథల్ని విన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథకు నాగార్జున ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ప్రసన్నని డైరెక్టర్ గా పరిచయం చేసే బాధ్యతను నాగార్జున తీసుకున్నారు. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున డబుల్ రోల్ లో కనిపించనున్నారట.

ఒక పాత్రలో నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తారట. ఈ పాత్ర కోసం డీ- ఏజ్ వి.ఎఫ్.ఎక్స్ ను వాడబోతున్నారు అని వినికిడి. అంతేకాదు యంగ్ నాగార్జున సరసన మిస్ ఇండియా మానస.. ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని వినికిడి. ఇటీవల నాగార్జున – మానస వారణాసి లతో ఓ ఫోటో షూట్ ను కూడా నిర్వహించినట్లు సమాచారం. మరి ఈ మిస్ ఇండియాని ఫైనల్ చేసుకున్నట్టు అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus