Nagarjuna: బిగ్ బాస్ నుండి నాగార్జున తప్పుకుంటున్నాడా?

బాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షోని సౌత్ లో స్టార్ట్ చేస్తున్నారు అని ప్రకటన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ షో ప్లాప్ అవుతుంది అని అంతా అనుకున్నారు. ముఖ్యంగా తెలుగులో మొదటి సీజన్ కే దుకాణం సర్దేస్తుంది అని విమర్శించారు. కానీ కట్ చేస్తే తెలుగులో ఈ సీజన్ సూపర్ సక్సెస్ సాధించింది. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. సూపర్ సక్సెస్ అందుకుంది. రెండో సీజన్ ను నాని హోస్ట్ చేయగా.. సీజన్ సూపర్ హిట్ అయ్యింది కానీ హోస్ట్ గా నాని ఫెయిల్ అయ్యాడు.

ఇక మూడో సీజన్ నుండి నాగార్జున హోస్ట్ చేయడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ 3 సూపర్ హిట్ అయ్యింది. 4 వ సీజన్ ను కూడా సూపర్ సక్సెస్ సాధించింది. 5 వ సీజన్ కూడా హిట్టే..! కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటిటీ సీజన్ మొదలైందో.. జనాలకు బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ పోయినట్టు ఉంది. అందువల్ల 6 వ సీజన్ ప్లాప్ అయ్యింది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో మినిమమ్ డిస్కషన్స్ కూడా జరగడం లేదు.

ఇక బిగ్ బాస్ రేంజ్ పడిపోవడంతో నాగార్జున కూడా డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సీజన్ కు సంబంధించిన కీలక విషయాలపై నిర్వాహకులు నాగార్జునతో డిస్కస్ చేయడానికి ప్రయత్నించగా.. అందుకు నాగ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. సాధారణంగా నాగార్జున వీకెండ్స్ లో మాత్రమే కనిపిస్తారు. వీక్ డేస్ లో ఈయన షో చూడరు. వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేసే ముందు నాగార్జునకి షోలోనే హైలెట్స్ చూపిస్తారు.

ఆ తర్వాత స్క్రిప్ట్ ను ఫాలో అవుతారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ పై జనాలకు ఆసక్తి ఉండేది కాబట్టి.. నాగార్జున ఇంట్రెస్టింగ్ గా హోస్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆయనకు కూడా ఆసక్తి లేనట్టు స్పష్టమవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus