అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన గత రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇందులో ‘ఆఫీసర్’ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా.. ‘మన్మథుడు2’ చిత్రం ప్లాప్ గా మిగిలింది. ఈ క్రమంలో నాగార్జున తరువాత సినిమా అయిన ‘వైల్డ్ డాగ్’ పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.దాంతో ‘ ‘వైల్డ్ డాగ్’ చిత్రం ఓటిటిలో అయినా విడుదల అవుతుందా?’ అని నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ ఓటిటిలో విడుదల చేసినా.. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరుగుతుందా అనే వాదన కూడా జరిగింది.
అయితే అలాంటి నెగిటివ్ కామెంట్స్ ను పటా పంచలు చేస్తూ.. ‘వైల్డ్ డాగ్’ చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. సోలొమన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి 20కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారట నిర్మాతలు. ఈ నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ ను థియేటర్లలో విడుదల చెయ్యాలని నిర్మాతలు మొదట ప్లాన్ చేశారు. అయితే లీడింగ్ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు.. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.23 కోట్లకు కొనుగోలు చెయ్యడానికి ముందుకొచ్చారట.
దాంతో ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలకు నేరుగా రూ.3కోట్లు లాభం వచ్చినట్టే..! అంతేకాకుండా శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మాల్సి ఉంది కాబట్టి.. ‘వైల్డ్ డాగ్’ కు భారీ లాభాలు దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే థియేట్రికల్ రిలీజ్ కనుక ఇవ్వకపోతే నాగార్జున అభిమానులు కొంత నిరాశచెందే అవకాశం ఉంది.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!