The Ghost: హిందీ రిలీజ్ కోసం నాగ్ పట్టుబట్టారా..?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాలీవుడ్ లో ఆయన అప్పుడప్పుడు నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలకపాత్ర పోషించారాయన. ఈ సినిమా బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున పట్టుదల, కోరిక కారణంగానే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి ‘ది ఘోస్ట్’ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఎప్పుడో అమ్మేశారు. ఇప్పుడు హిందీలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతల వల్ల సాధ్యం కాదు. హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న బయ్యర్ వల్ల మాత్రమే కుదురుతుంది. అందుకే ఆ బయ్యర్ ను హైదరాబాద్ కు పిలిపించి.. ‘ది ఘోస్ట్’ సినిమాను చూపించినట్లు తెలుస్తోంది. అలా చూపించి.. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది.

హిందీలో సినిమా హిట్ అయి.. డబ్బులు వస్తే ఓకే. అలా కాకపోతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో నాగ్.. సదరు బయ్యర్ తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బహుశా.. నష్టాలను తాను భరిస్తానని నాగార్జున చెప్పి ఉంటారని టాక్. ఈ సినిమాపై నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నారు.

అందుకే విశాఖ ఏరియాలో నాగార్జున స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలై సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus