అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2016వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం అప్పటికి నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఆ చిత్రంలో బంగార్రాజు పాత్ర ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దాంతో ఆ పాత్రను హైలెట్ చేస్తూ ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నాగార్జున ఎప్పుడో ప్రకటించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలనే ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తాడని..
నాగార్జున అనేక సార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ‘బిగ్ బాస్3’ పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘బిగ్ బాస్4’ పూర్తయినా కూడా ఇంకా ఆ ప్రాజెక్టు మొదలుకాలేదు. దీంతో అసలు ‘బంగార్రాజు’ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున కరోనా టైములో కూడా ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్ ను ఇట్టే ఫినిష్ చేసేసారు.
మరోపక్క అనిల్ రావిపూడి లేదా ప్రవీణ్ సత్తారు వంటి యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి తరుణంలో ‘బంగార్రాజు’ ఉండే అవకాశం ఉందా? అంటే ఎవ్వరైనా అవునని చెప్పలేరు. అయితే 2021 సంక్రాంతి లేదా ఆ తరువాత ‘బంగార్రాజు’ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది. కళ్యాణ్ చేసిన మార్పులు నాగార్జునకు నచ్చడంతో ‘బంగార్రాజు’ వెంటనే ప్రారంభమవుతుందని సమాచారం.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!