అక్కినేని నాగార్జున హీరోగా 2015 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం ఘనవిజయం సాధించింది. నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను నమోదు చేసిన రికార్డ్ ను కూడా సృష్టించింది ఆ చిత్రం.దానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ఉంటుందని ఆ టైంలోనే ప్రకటించారు. కానీ అది సెట్స్ పై వెళ్ళడానికి 6 ఏళ్ళు టైం పట్టింది. అయితే సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం కానీ.. చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతోంది.
2022 సంక్రాంతి బరిలోనే ఈ చిత్రాన్ని దించాలని నాగార్జున డిసైడ్ అయ్యారు. అయితే అదే టైంకి ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా రిలీజ్ అవుతుంది. ఒక 4 వారాల వరకు దానికి ఎక్కువ స్క్రీన్స్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తారు. ఆ టైములో ‘బంగార్రాజు’ రంగంలోకి దిగినా తెలుగు రాష్ట్రాల్లో 400 కి మించి థియేటర్లు దక్కవు. అయినప్పటికీ జనవరిలోనే ‘బంగార్రాజు’ని దించాలని నాగ్ ప్లాన్ చేస్తున్నాడు.దీనికి ప్రధాన కారణం ‘జీ స్టూడియో సంస్థ’ వారే ఈ చిత్రానికి ఫండింగ్ పెడుతున్నారు.
‘అన్నపూర్ణ స్టూడియోస్’ వారితో కలిసి వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున వీరితో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. జనవరిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలి. అది సంక్రాంతికైనా.. రిపబ్లిక్ డే కి అయినా..! లేదంటే ‘జీ’ వారికి నాగ్ ఈ చిత్రం బడ్జెట్లో 15శాతం తిరిగి చెల్లించాలట. అందుకే నాగ్ తొందర.