Namitha: నమిత కూడా విడాకులు తీసుకోబోతుందా?

‘సొంతం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నమిత (Namitha) .. ఆ తర్వాత ‘జెమిని’ (Gemeni) ‘ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’ ‘ఒక రాజు ఒక రాణి’ (Oka Raju Oka Rani) ‘బిల్లా’ (Billa) ‘సింహా’ (Simha) వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. అయినప్పటికీ తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో తమిళంలో వరుస సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అక్కడ కూడా పెద్దగా రాణించింది లేదు. కానీ అక్కడ ఎఫైర్ వార్తలతో ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది.

అలా ఈమెకు ఛాన్సులు వచ్చేవి కానీ లీడ్ రోల్స్ కాదు. ఇక కొన్నాళ్ల తర్వాత అంటే 2017 లో కోలీవుడ్ నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈమె గురించి గాసిప్స్ రావడం తగ్గలేదు. కొన్ని రోజుల నుండి నమిత తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. నమిత ఈ విషయం పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ‘నేను నా భర్త విడిపోతున్నామని వార్తలు వచ్చాయి.

మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా మాకు కాల్ చేసి ‘నిజమా’ అని అడుగుతున్నారు. ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో.. అర్థం కావడం లేదు. నేను 2 రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఓ వీడియో చేశాము. ఈ విడాకుల వార్తలు చూసి నేను నా భర్త నవ్వుకున్నాం. కానీ ఈ వార్తలు మమ్మల్ని ఏమీ బాధించలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది నమిత. ఇక వీరికి కవలలు ఉన్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus