Namitha: నమిత శరీర బరువు పెరగడానికి అదే కారణమా?

ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు వెళుతుంటారు అయితే కొంతమంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.అలాంటి వారిలో నటి నమిత ఒకరు. సొంతం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు అనంతరం జెమిని బిల్లా వంటి పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నమిత ఉన్నఫలంగా శరీర బరువు పూర్తిగా పెరిగిపోయారు.

దాంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఇక అవకాశాలు వచ్చిన హీరోయిన్గా మాత్రం కాకుండా చిన్న చిన్న పాత్రలలో తనకు అవకాశాలు రావడంతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనటువంటి నమిత తమిళ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడికి వెళ్లారు అయితే అక్కడ మాత్రం సక్సెస్ అయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో నటించిన నమితకు తమిళ అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు.

అలా తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి (Namitha) ఈమె పూర్తిగా శరీర బరువు పెరగడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా తన శరీర బరవు కారణంగా ఈమె తన కెరియర్ కోల్పోయిందని చెప్పాలి. అయితే ఈమె శరీర బరువు పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. నమిత ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే పూర్తిగా డిప్రెషన్ కి గురి కావడం అలాగే థైరాయిడ్ వంటి వ్యాధితో బాధపడటం వల్లే ఈమె అధిక శరీర బరువు పెరగారని తెలుస్తుంది.

ఇలా థైరాయిడ్ కోసం నిత్యం మందులు వాడటం వల్ల నమిత అధికంగా శరీర బరువు పెరిగారని బరువు పెరగడం వల్లే తనకు అవకాశాలు రాలేదని తెలుస్తోంది. ఇలా శరీర బరువు పెరిగినటువంటి ఈమెకు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే వీరేంద్ర చౌదరి అనే నిర్మాతను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు జన్మించారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus