బాలీవుడ్ డ్రగ్ కేసులో నమ్రత పేరు…!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మిస్టరీ మరుగున పడింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ డ్రగ్ స్కాండల్ కింద మారింది. సుశాంత్‌ది అతడిది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాల మధ్య మొదలైన కేసు చివరికి ఎవరెవరు డ్రగ్స్ దగ్గరకు వచ్చింది. సుశాంత్ లవర్, హీరోయిన్ రియా చక్రవర్తి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యింది. విచారణలో ఆమె డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ సహా కొందరికి సమన్లు జారీ చేయనున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.

బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత పేరు కూడా వుందని ముంబై మీడియా వర్గాలు చెబుతున్నారు. ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు టాలెంట్ మేనేజర్ జయ సాహా వాజ్ఞ్మూలం ఇచ్చారట. ఎన్‌సిబి దర్యాప్తులో జయ సాహా, నమ్రత చాటింగ్ చేసుకున్నట్టు బయటపడిందట. ఒక జాతీయ ఛానల్ డ్రగ్ సప్లయర్లు, సెలబ్రిటీల మధ్య జరిగిన ఛాటింగ్ ను లీక్ చేసింది. అందులో ‘ఎన్’ అని ఒకరితో ఉన్న ఛాటింగ్ నమ్రతతో చేసిందని భావిస్తున్నారు.

డ్రగ్స్ కోసం జయ సాహాతో నమ్రత ఛాటింగ్ చేసినట్టు ఎన్‌సిబి వర్గాలు వెల్లడించాయట. తనకు డ్రగ్స్ కావాలని నమ్రత అడిగారట. ‘ముంబైలో మంచి ఎండి ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఇచ్చాక పార్టీ చేసుకుందాం’ అని నమ్రత మెసేజ్ చేశారట. నమ్రత పేరును నేషనల్ మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. ఇప్పటివరకు నమ్రత పేరును ఎన్‌సిబి చెప్పలేదు. పూర్తి వివరాలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, దియా మీర్జా పేర్లు సైతం బయటకొచ్చాయి. ఇప్పటికి దియా మీర్జా తానెప్పుడూ డ్రగ్స్ కొనుగోలు చేయడం గానీ, తీసుకోవడం గానీ చేయలేదని వివరణ ఇచ్చారు. ఇతరులు స్పందించలేదు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus