నటసింహం నందమూరి బాలకృష్ణ జయాపజయాలకు అతీతంగా వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరొక సినిమాలో నటించనున్నారని సమాచారం. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటూ బాలకృష్ణ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ లలో ఒకరైన వినాయకరావు ఒక ఇంటర్య్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.
తనవైపు నుంచి తప్పు ఉంటే బాలకృష్ణ క్షమించమని కోరడానికి కూడా వెనుకాడరని వినాయకరావు తెలిపారు. తాను సీనియర్ ఎన్టీఆర్ పై రెండు పుస్తకాలు రాశానని యుగానికి ఒక్కడు, యుగపురుషుడు పేర్లతో ఆ పుస్తకాలను రాశానని వినాయకరావు వెల్లడించారు. ఎన్టీఆర్ పై రాసిన బుక్స్ లాంఛ్ కోసం బాలకృష్ణను సంప్రదించగా ఆయన వెంటనే బుక్ లాంఛ్ కార్యక్రమానికి రావడానికి అంగీరించారని వినాయకరావు తెలిపారు. ఆ సమయంలో బాలకృష్ణ దాసరి నారాయణరావు డైరెక్షన్ లో పరమవీరచక్ర సినిమాలో నటిస్తుండటంతో బుక్ లాంఛ్ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారని వినాయకరావు చెప్పుకొచ్చారు.
ఆరు గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ప్రసాద్ ల్యాబ్ కు 8 :30కు చేరుకున్నారని వినాయకరావు తెలిపారు. ఆ కార్యక్రమానికి నారాయణరెడ్డి, రామానాయుడు, కృష్ణవేణి, సత్యనారాయణ వచ్చారని ఆలస్యంగా వచ్చిన బాలకృష్ణ అందరికీ సారీ చెప్పారని వినాయకరావు వెల్లడించారు. స్టార్ హీరో అయినప్పటికీ బాలకృష్ణ ఆలస్యంగా వచ్చిందుకు సారీ చెప్పడం గమనార్హం. బాలకృష్ణ మీకు ఏమైనా ఆర్థిక సహాయం కావాలా..? అని తనను అడిగారని అలా అనడంతో తాను షాకయ్యానని వినాయకరావు తెలిపారు.