Balakrishna: కర్నూలు జిల్లాలోని ఆ ఊరిలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు మంచి లాభాలను అందించడం గమనార్హం. అయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో బాలయ్య పేరిట అరుదైన రికార్డ్ ఉంది. బాలయ్య నటించిన సినిమాలలో ఏకంగా 11 సినిమాలు షిఫ్టింగ్ లేకుండా ఎమ్మిగనూరులో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి.

Balakrishna

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బాలయ్య రికార్డుకు దరిదాపుల్లో సైతం మరే హీరో లేరు. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఫ్లాప్ సినిమాలు సైతం ఎమ్మిగనూరులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. బాలయ్య సైతం ఇక్కడి అభిమానులంటే ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకుంటారు. బాలయ్య భవిష్యత్తు సినిమాలు సైతం ఈ ప్రాంతంలో 100 రోజులు ఆడి మరిన్ని సంచలన రికార్డులు బాలయ్య ఖాతాలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ 2025 సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. బాలయ్య దాదాపుగా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చేయగా అధికారికంగా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. బాలయ్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయేమో చూడాలి. టైటిల్ టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ (S.S.Thaman) మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. బాలయ్య మార్క్ ప్రతి సీన్ లో ఉండేలా బాబీ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. ఈ సినిమాతో అటు బాలయ్య ఇటు బాబీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

డైలాగ్‌ దొంగిలించిన అమితాబ్‌.. కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus