Chaitanya Krishna: నా సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా ట్రోల్ చేశారు.. జాగ్రత్తగా ఉండండి : చైతన్య కృష్ణ

నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) 2003 లో వచ్చిన ‘ధమ్’ సినిమాతో నటుడిగా కెరీర్ ని స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం.. పైగా అందులో జగపతి బాబు (Jagapathi Babu) మెయిన్ హీరో కావడంతో చైతన్య కృష్ణ హైలెట్ అవ్వలేదు. తర్వాత అతనికి ఆఫర్లు కూడా రాలేదు. చాలా కాలం తర్వాత అతను ‘బ్రీత్’ (Breathe) అనే సినిమా చేశాడు. గతేడాది ఆ సినిమా రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయినట్టు ప్రేక్షకులకి తెలీదు.

అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో.. అందరికీ తెలిసొచ్చింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో చైతన్య కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలు ట్రోల్ మెటీరియల్ అయ్యాయి. సినిమా ఓటీటీలోకి వచ్చాక పర్వాలేదు అనే టాక్ వచ్చినా.. ఎందుకో మరింతగా ట్రోలింగ్ జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. చైతన్య కృష్ణ తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్ ఇస్తూ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఆ పోస్ట్ ద్వారా నందమూరి చైతన్య కృష్ణ స్పందిస్తూ.. “వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ, మీరు సపోర్ట్ చేశారు అని అంటున్నారు. మీరు ఎవరూ మా బొచ్చు కూడా పీకలేరు.నేను ఉండగా చంద్రబాబు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని ఎవరూ టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్ళు కలిసి నన్ను బాగా చేశారు. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఘాటుగా రాసుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus