నందమూరి-మెగాస్టార్ కలయికలో!!!

ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్….దర్శకులు అందరిలో కొంచెం డిఫరెంట్. ఆయన సినిమా తీసే తీరు కానీ, పాత్రలను మలచుకునే తీరు కానీ, మిగిలిన వాళ్ళతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ కు తగ్గట్టు బాడీ ల్యాంగ్వేజ్ , ఇక కాంబినేషన్స్ ఇలా అన్నీ ఆయనకు నచ్చిన విధంగా పీపుల్స్ పల్స్ తెలుసుకుని మరీ క్రియేట్ చేస్తాడు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే కాంబినేషన్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా పూరీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చెయ్యనున్నాడు.

అదెలాగా అంటే…అటు నందమూరి వంసాన్ని, ఇటు మెగాస్టార్ ను కలపి ఒకే సినిమాలో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ,నందమూరి హీరోతో…మెగాస్టార్?? నిజమేనా అంటే….నిజమే కానీ మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ కాదు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాభ్. ఇంతకీ విషయం ఏమిటంటే…ప్రస్తుతం కళ్యాణ్ రాంతో రీమిక్స్ సినిమా తీస్తున్న పూరి ఆ సినిమాలో కళ్యాణ్ రాంతో అమితాభ్ ను నటించేలా ప్లాన్ చేయిస్తున్నాడు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే…కళ్యాణ్ రాం సినిమాలో 15 నిమిషాల ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఆ రోల్ అమితాభ్ కు అయితే సూపర్ గా సూట్ అవుతుంది అని ఇలా ప్లాన్ చేశాడు పూరీ. ఇక అమితాబ్ కు పూరికి మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా కూడా వచ్చింది. మరి పూరీ ఇస్తున్న ఈ ఆఫర్ ని అమితాభ్ ఎలా స్వీకరిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus