Nandamuri Harikrishna: కొడుకుల సినిమాలలో హరికృష్ణకు ఇష్టమైన సినిమాలు ఇవే!

  • June 4, 2024 / 06:16 PM IST

సీనియర్ హీరో హరికృష్ణ (Harikrishna) తక్కువ సినిమాల్లోనే నటించినా సీతారామరాజు (Seetharama Raju), లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలు ఆయన నటనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హరికృష్ణ వారసులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఈ హీరోలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. హరికృష్ణ భౌతికంగా మరణించినా ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు. అయితే కొడుకుల సినిమాలలో పటాస్ (Pataas) , టెంపర్ (Temper) , జనతా గ్యారేజ్ (Janatha Garage) అంటే ఎంతో ఇష్టమని హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఒక ఈవెంట్ లో వెల్లడించారు.

ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. పటాస్ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకం అని కళ్యాణ్ రామ్ భావిస్తే టెంపర్ సినిమా తన కంబ్యాక్ మూవీ అని జూనియర్ ఎన్టీఆర్ నమ్ముతారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) సినిమాలో నటిస్తున్నారు. దేవర సినిమా విడుదలకు 125 రోజుల సమయం మాత్రమే ఉంది.

త్వరలో దేవర మూవీ నుంచి టీజర్ రిలీజ్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ కు కొదువ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ (Siva Koratala) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. దేవర సినిమా జక్కన్న నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసే మూవీ అవుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ (Rajinikanth) వేట్టయాన్ (Vettaiyan) మూవీ రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus