Jr NTR: వైరల్ అవుతున్న నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తారక్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. టెంపర్ సినిమా నుంచి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా సమయంలో తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి రామకృష్ణ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటాడని చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సర్కార్ ఆగడాలను తిప్పికొట్టాలని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడని నందమూరి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ప్రస్తుతం తారక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని అందువల్ల తారక్ పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశం అయితే లేకపోవచ్చని రామకృష్ణ అన్నారు.

నందమూరి రామకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ మాత్రం పాలిటిక్స్ గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దుబాయ్ కు వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దేవర సినిమాకు సంబంధించి తారక్ ఇప్పటికే ఐదు షెడ్యూళ్లను పూర్తి చేశారు.

తారక్ (Jr NTR) సింగిల్ గానే దుబాయ్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తారక్ స్పెషల్ ట్రైనింగ్ కోసం దుబాయ్ కు వెళ్లాడని సమాచారం అందుతోంది. వరుస ప్రాజెక్ట్ లతో తారక్ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus