ఒకే దారిలో నడుస్తున్న ముగ్గురు నందమూరి స్టార్ హీరోలు.. కానీ?

నందమూరి హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ఈ ముగ్గురు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. దేవర గ్లింప్స్ ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుండగా దేవర టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. దేవర సినిమాలో రక్తం ఏరులై పారుతుందని ఈ సినిమాలో వయోలెన్స్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. మరోవైపు నందమూరి హీరోలు సీక్వెల్స్ దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముగ్గురు నందమూరి స్టార్ హీరోలు తమ సినిమాల సీక్వెల్స్ పై దృష్టి పెట్టడం గమనార్హం.

అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కనున్న అఖండ2 మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా దేవర2 ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ బింబిసార, డెవిల్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో క్రేజీ మూవీ రానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus